అన్వేషించండి

Parineeti Chopra Wedding: ఓర్ని.. పెళ్లికి ముందు చిన్న పిల్లల్లా మారిపోయిన పరిణితీ, రాఘవ్ - మీకూ ఇలా ఆడాలని ఉందా?

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి రీసెంట్ గా ఘనంగా జరిగింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన వేడుకలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడింది. పెళ్లికి ముందు ఇరు కుటుంబ సభ్యులు ఫ్రెండ్లీగా క్రికెట్ మ్యాచ్ ఆడారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ఏడు అడుగులు నడించింది. సెప్టెంబరు 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సుమారు 200 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు. 50 మందికిపైగా వీఐపీలు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కెజ్రీవాల్  హాజరయ్యారు. టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా, క్రికెటర్ హర్బజన్ సింగ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శివసేన నేత ఆదిత్య థాకరే తదితర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.  

చోప్రా VS చద్దా క్రికెట్ మ్యాచ్

చాలా మంది ప్రముఖులు పెళ్లి వేడుకలను సంగీత్ లాంటి వేడుకలతో మొదలు పెడతారు. కానీ, పరిణీతి, రాఘవ్ కుటుంబాలు కాస్త డిఫరెంట్ గా పెళ్లి వేడుకలను ప్రారంభించాయి. ఇరు కుటుంబ సభ్యులు ఫ్రెండ్లీగా క్రికెట్ మ్యాచ్ ఆడారు. తాజాగా ఈ వీడియోను పరిణీతి ఇన్ స్టా ద్వారా పంచుకుంది. క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, లెమన్ రేస్,  మ్యూజికల్ చైర్స్ సహా పలు రకాల ఆటలు ఆడారు. బంధుమిత్రులు ఈ ఆటల్లో పాల్గొని సందడి చేశారు.  రెండు కుటుంబాల మధుర క్షణాలను ఈ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  ఇందులో రాఘవ్ బౌలింగ్, బ్యాటింగ్ విన్యాసాలు, పరిణీతి గేమ్స్ లో విజయం సాధించడం అందరినీ ఆకట్టుకున్నాయి.  "పెళ్లి కోసం కొత్త సంప్రదాయాలను సృష్టించాం. ప్రెషర్, డ్రామా లాంటివి లేకుండా అందరం కలిసి ఆహ్లాదంగా గడిపాం” అని పరిణీతి వెల్లడించింది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

చోప్రాల హృదయాలను గెలుచుకున్నాం- రాఘవ్

ఇక తమ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్స్ కు సంబంధించి రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. “మా వివాహానికి ముందు చాలా ఆచారాలు పాటించాం. అంతేకాదు, హ్యాపీగా పలు ఈవెంట్స్ లో పాల్గొన్నాం. ఇందులో మ్యూజికల్ చైర్స్,  లెమన్ రేస్,  మూడు కాళ్ల రేసు, ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉన్నాయి. ఇవి మా బంధువులను చాలా సంతోష పెట్టాయి. ఈ గేమ్స్ లో మేం విజేతలుగా నిలిచాం. చోప్రాల హృదయాలను గెలుచుకున్నాము. మా కుటుంబంలో ఇదో పండుగ వాతావరణంలా ఉంది” అని రాసుకొచ్చారు.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

సెప్టెంబర్ 22న ఉదయపూర్‌లో మెహందీ ఈవెంట్‌తో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా వివాహా వేడుకలు  ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 23న ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 24న ఇద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. సంసార జీవితంలోకి అడుగు పెట్టారు.   

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Na Wife Missing OTT : వైఫ్ మిస్సింగ్... అసలు క్రిమినల్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు క్రైమ్ థ్రిల్లర్
వైఫ్ మిస్సింగ్... అసలు క్రిమినల్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు క్రైమ్ థ్రిల్లర్
Psychological Thriller OTT : నిద్రలో నడిచే అలవాటు... కలలు నిజమైతే? - ఓటీటీలోకి వచ్చేసిన రాజు వెడ్స్ రాంబాయి హీరో సైకలాజికల్ థ్రిల్లర్
నిద్రలో నడిచే అలవాటు... కలలు నిజమైతే? - ఓటీటీలోకి వచ్చేసిన రాజు వెడ్స్ రాంబాయి హీరో సైకలాజికల్ థ్రిల్లర్
Jailer 2 Collection : రజనీ కాంత్ జైలర్ 2 మరో రికార్డు - వారం రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
రజనీ కాంత్ జైలర్ 2 మరో రికార్డు - వారం రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
Embed widget