అన్వేషించండి

Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్

Pushpa 2 Actor Allu Arjun Case | పుష్ప 2 నటుడు అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం దాడికి పాల్పడిన నిందితులకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఓయూ జేఏసీ నేతలు హీరో ఇంటి వద్ద నిన్న ఆందోళనకు దిగారు.

Accused gets bail in Allu Arjun House Attack Case | హైదరాబాద్‌: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ ఇంటిపై టమోటాలు విసిరి, పూలకుండీలు ధ్వంసం చేసి ఆందోళనకు దిగిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ జేఏసీ నేతలు (OU JAC Leaders)ను వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో జూబ్లీహిల్స్‌ పోలీసులు హాజరు పరిచారు.   ఆరుగురు నిందితులకు ఒక్కొక్కరు రూ.10వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు. 

ఆదివారం నటుడి ఇంటిపై దాడి

ఓయూ జేఏసీ నేతలు ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఇంటి మీద టమాటాలు విసరడంతో పాటు పూలకుండీలు ధ్వంసం చేసి రచ్చరచ్చ చేశారు. దాంతో అల్లు అర్జున్ నివాసం వద్ద ఆ సమయంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి బోనాల నాగేశ్‌ మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజుగౌడ్, ఛైర్మన్‌ రెడ్డిశ్రీను ముదిరాజ్, కన్వీనర్‌ పి.ప్రకాశ్, నేత మోహన్, ఎన్‌ఎస్‌యూఐ (NSUI) రాష్ట్ర కార్యదర్శి బుద్దా ప్రేమ్‌ కుమార్‌ గౌడ్, పి. ప్రకాశ్‌ తదితరులు నటుడి ఇంటి వద్దకు చేరుకుని అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్

కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్, అమెరికాకు శ్రీతేజ్‌ను పంపాలి

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో చనిపోయిన మహిళ రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పట్టించుకోలేదని ఆరోపించారు. కొందరు నేతలు ప్రహరీ ఎక్కి నటుడి ఇంట్లోకి టమాటాలు విసిరారు. అంతటితో ఆగకుండా పూల కుండీలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఫ్యామిలీ పరామర్శించి వారికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శ్రీతేజ్ ను అమెరికాకు పంపించి మెరుగైన వైద్య చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు. ఓయూ జేఏసీ నేతలు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి దూసుకురావడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నటుడి సెక్యూరిటీ సిబ్బందికి, జేఏసీ నేతలకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. 

Also Read: Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget