Mahakumbh: ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
Digital snan : కుంభమేళాకు వెళ్లలేకపోయిన వారికి ఆ యువకుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. పదకొండు వందలు చెల్లిస్తే డిజిటల్ స్నాన్ చేయిస్తానంటున్నాడు.

Digital snan for Rs 1,100 at Mahakumbh: ఈ ఆలోచన నాకెందుకు వచ్చిందని ఫీలవమాకండి.. మీకెందుకు రాలేదని బాధపడండి అని ఓ సినిమాలో కమెడియన్ డైలాగ్ ఉంటుంది. కానీ మహాకుంభమేళాలో హడావుడి చేస్తున్న ఈ యువకుడ్ని చూస్తే ఛ.. ఈ ఐడియా మనకు ఎందుకు రాలేదని ఖచ్చితంగా ఫీలవుతాం. ఇంతకీ అతను ఏం చేస్తున్నాడో తెలుసా.. భక్తులకు డిజిటల్ స్నాన్ చేయిస్తున్నాడు. అందుకు రూ. పదకొండు వందలు వసూలు చేస్తున్నాడు. విచిత్రమైన ఐడియాతో రోజుకు లక్షలు సంపాదిస్తున్నాడు.
Meet Deepak Goyal, Founder of Prayag Enterprise, a startup offering Digital Mahakumbh Snan
— Veena Jain (@DrJain21) February 21, 2025
Simply send ur photo via WhatsApp & ₹1100, & he will print your photo & perform snan at Sangam on ur behalf
USA, China etc can't compete with us in this field 😎 pic.twitter.com/lddgZHDIyk
ప్రయాగరాజ్ కు చెందిన దీపక్ గోయల్.. ప్రయాగ్ ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీ పెట్టాడు. కుంభమేళాలో సేవలు అందిస్తున్నాడు. అతను అందిస్తున్న సేవ ఏమిటంటే.. డిజిటల్ స్నానాలు చేయించడం. 144 ఏళ్లకు ఓ సారి వచ్చే కుంభమేళాలో స్నానం చేయడం ప్రతి ఒక్క హిందువు కల. అయితే చాలా మంది దాన్ని నెరవేర్చుకోలేరు. అలాంటి వారి కోసమే దీపక్ గోయల్ ఈ సర్వీస్ చేపట్టారు. ఒక్కొక్కరు ఫోటో మెయిలో..వాట్సాపో చేసి.. రూ. పదకొండు వందలు పంపితే.. వారి ఫోటోను కాపీ తీసుకుని.. వీడియో కాల్ చూపిస్తూ మరీ.. ఆ ఫోటోలకు స్నానం చేయిస్తాడు. అదే డిజిటల్ స్నాన్.
This is some next-level scam artistry disguised as spiritual innovation. So this Goel guy runs what he says is a startup--Prayag Enterprises-- where he charges ₹1100 for a digital photo snan at Mahakumbh. The process? You send him your photo on WhatsApp, he prints it out, and + pic.twitter.com/2NVsBOPLfS
— Arman Ahmad (@AAhmad105) February 19, 2025
కుంభమేళా ప్రారంభ రోజుల్లో మోనాలిసా భోంస్లే హైలెట్ అయితే ఇప్పుడు దీపక్ గోయల్ వంతు. ఆయన గురించి చర్చించుకోవడం ఎక్కువైపోయింది. ఇలాంటి టెక్నిక్‌లు ఏ దేశంలోనూ ఎవరూ పట్టుకోలేరని ప్రశంసిస్తున్నారు.
DEEPAK GOYAL running the ultimate Mahakumbh startup. Just WhatsApp him your pic, he prints it, dunks it in Sangam, and bam your sins get a holy rinse for ₹1100.
— Lokesh Bag (@lokeshbag67) February 21, 2025
NO TRAIN TICKETS
NO COLD WATER DIPS
Just pure WhatsApp DIGITAL SNAN. pic.twitter.com/FD7hcV70uS
స్టార్టప్ ప్రారంభిస్తే వెంటనే బిలియన్ల ఆదాయం వస్తుందని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

