YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
YS Jagan Pulivendula Tour | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు బెంగళూరు నుంచి పులివెందులకు రానున్నారు. నాలుగు రోజులపాటు పులివెందులలో జగన్ పర్యటించనున్నారు.
YS Jagan to visit Pulivendula | తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో జగన్ పులివెందుల పర్యటన వివరాలను వైసీపీ విడుదల చేసింది. మంగళవారం నాడు కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి జగన్ ఏపీకి రానున్నారు.
డిసెంబర్ 24న షెడ్యూల్
మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ జగన్ తన తండ్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డికి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమవుతారు, సమావేశం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి రాత్రికి అక్కడ నివాసంలో జగన్ బస చేస్తారు
డిసెంబర్ 25న షెడ్యూల్
బుధవారం ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు, ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జగన్ పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు
డిసెంబర్ 26, 27న షెడ్యూల్
పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాజీ సీఎం జగన్ ప్రజాదర్భార్ నిర్వహిస్తారని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 27న ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న ఓ వివాహ వేడుకకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారని పార్టీ నేతలు తెలిపారు. జగన్ పర్యటనకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.