They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్తో మెగా ఫ్యాన్స్కు పూనకాలే
They Call Him OG : 'పుష్ప 2' మూవీలో 'సూసేకి' సాంగ్ తో అదరగొట్టిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య 'ఓజీ'లో ఓ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
Nehas song in OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'ఓజి'. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'పుష్ప 2' మూవీ కొరియోగ్రాఫర్ భాగం కాబోతున్నారనే వార్త మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
'ఓజి' కోసం 'పుష్ప' కొరియోగ్రాఫర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ 'దె కాల్ హిమ్ ఓజి'. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో మెరువబోతున్నారు. ఆయనకు జోడిగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ఆయనతో పాటు శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
ఇటీవలే బ్యాంకాక్ లో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసింది చిత్రం బృందం. అయితే తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో ఉన్న పిక్ ను 'ఓజి' టీంకు సంబంధించిన వ్యక్తి పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ కోసం గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ వహించారని తెలుస్తోంది. నేహా శెట్టి 'డీజే టిల్లు' మూవీతో మంచి పాపులారిటీని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆమె ఈ సినిమాలో పలు కీలక సన్నివేశాలతో పాటు ప్రత్యేక సాంగ్ కూడా చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'పుష్ప 2' మూవీలో 'సూసేకి' పాటకి ఆయన కొరియోగ్రఫీ అందించారు. ఇప్పుడు గణేష్ ఆచార్య పవన్ కళ్యాణ్ 'ఓజి'కి కూడా కొరియోగ్రఫీ చేస్తున్నారనే వార్త బయటకు రావడం ఈ మూవీపై మరింత క్రేజ్ ను పెంచేసింది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
'గేమ్ ఛేంజర్' కోసం రంగంలోకి పవన్
ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'ఓజీ'తో పాటు ఈ మూవీ కూడా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఏపీలోని రాజమండ్రిలో లేదా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని, అందులో పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాబోతున్నారని అంటున్నారు. ఈ విషయం గురించి ఇంకా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.