OYO: ఓయోను బాయ్‌కాట్ చేయాలని ఊగిపోతున్న నెటిజన్లు - కారణం మీరనుకున్నది కాదు.. అంత కంటే పెద్దదే !
Boycott OYO: ఓయోను బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు ఆవేశపడుతున్నారు. ఇటీవల పెళ్లి కాని జంటలకు రూములు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ కారణంతో మాత్రం కాదు.

OYO Controversial Advertisement: ప్రముఖ ఆన్ లైన్ హోటల్ రూమ్ బుకింగ్ సంస్థ 'OYO రూమ్స్' వివాదంలో ఇరుక్కుంది. ఆ సంస్థ ఇచ్చిన ప్రకటన ఒకటి మతపరమైన టర్న్ తీసుకుంది. ఒక హిందీ వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఓయోను బాయ్ కాట్ చేయాలన్న ట్రెండ్ ప్రారంభణయింది.
Trend Alert 🚨 - #BoycottOYO
— Naresh Vijayvargiya (@INVijayvargiya) February 21, 2025
लोग कहते हैं कि भगवान हर जगह हैं - बस कुछ ऐसे ही हम भी हैं " इन @oyorooms की इतनीं औकात हो गयी कि ये अपनी तुलना भगवान से कर रहे हैं और उसका विज्ञापन भी निकाल रहे हैं , इस विज्ञापन को रद्द करके माफी मांग लो नही तो अंजाम भुगतने को तैयार रहना , इतने… pic.twitter.com/mqZWfy87OU
ఓయో విడుదల చేసిన ప్రకటనలో "భగవాన్ హర్ జగహ్ హై" అనే ట్యాగ్‌లైన్ ఉంది. "దేవుడు ప్రతిచోటా ఉన్నాడు "అని దీనర్థం. దీనికి నేరుగా దిగువన "ఔర్ ఓయో భీ" అని ఉంది. అంటే భగవంతుడు ఎక్కడెక్కడ అయితే ఉన్నాడో.. అక్కడ ఓయో కూడా ఉందన్నది ఆ ప్రకటన సారాంశం. అయితే ఈ ప్రకటన ద్వారా హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారంటూ సోషల్ మీడియాలో బాయ్ కాట్ ఓయో అంటూ ట్రెండ్ ప్రారంభమయింది.
#BoycottOYO 🚨
— सनातनी हिंदू मनीष प्र.स.® (E&SWS) (@TiwariM69906697) February 21, 2025
Gkm6
OYO की हरकतें अब कानून के दायरे में आनी चाहिए! सिर्फ माफी से काम नहीं चलेगा, इस पर सख्त कानूनी कार्रवाई होनी चाहिए ताकि भविष्य में कोई हिंदू आस्था का अपमान करने की हिम्मत न करे! pic.twitter.com/QSQDWXphJY
ఓయో ప్రకటన కర్తల ఉద్దేశం..అన్ని చోట్లా ఓయో సౌకర్యం ఉన్న హోటల్స్ ఉన్నాయని చెప్పడం. అంటే కుంభమేళాతో పాటు ఇతర పుణ్యక్షేత్రాల దగ్గర కూడా ఓయో హోటళ్లు ఉంటాయని చెప్పదల్చుకున్నారు. కానీ ఓయోకు ఉన్న బ్యాడ్ ఇమేజ్ వల్ల అలాంటి అర్థం కాకుండా.. మరో అర్థం యువతలోకి వెళ్లింది. దీంతో వారు సీరియస్ గా తీసుకున్నారు.
हिंदुओ मेरी आवाज को दूर तलक ले
— बागेश्वर बाबा (@BageshwarBaba_) February 21, 2025
जाने के लिये साथ दो 🙏
OYO जैसे होटलों में क्या होता है क्या नही ये सारी दुनिया जानती है, बिजनेस प्रमोशन में भगवान को बीच मे लाना शर्मनाक है @riteshagar को तुरन्त माफी मांगते हुए ये विज्ञापन हटवाना चाहिये ..#BoycottOYO pic.twitter.com/XFn4NmJSrK
సున్నితమైన విషయం కావడంతో ఓయో కూడా స్పందించింది. తాము రెలిజియస్ టూరిజంను ప్రోత్సహిస్తూ ప్రకటన ఇచ్చామన్నారు.
— OYO (@oyorooms) February 21, 2025
సోషల్ మీడియా కాలంలో ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా.. చూసుకోవడమే పెను సవాల్‌గా మారుతోంది.





















