Telugu Ghost Movies: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ to ‘లవ్ మీ’- ఏప్రిల్‌లో వారానికో హర్రర్ మూవీ, అన్నీ థియేటర్లలోనే!
ఈ నెలలో పలు దెయ్యం సినిమాలు థియేటర్లలో భయపెట్టనున్నాయి. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, ‘లవ్ మీ’తో పాటు ‘బాక్’ సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
![Telugu Ghost Movies: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ to ‘లవ్ మీ’- ఏప్రిల్‌లో వారానికో హర్రర్ మూవీ, అన్నీ థియేటర్లలోనే! Geethanjali Malli Vacchindi to Love Me - These Horror movies will release in April month Telugu Ghost Movies: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ to ‘లవ్ మీ’- ఏప్రిల్‌లో వారానికో హర్రర్ మూవీ, అన్నీ థియేటర్లలోనే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/11/69cb656fbc24dd936d08ad2d80f6c9ae1712838946523544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
These Are The Ghost Movies That Are Shaking In Theaters This Month : టాలీవుడ్ లో మళ్లీ హారర్, థ్రిల్లర్ చిత్రాలు సందడి చేస్తున్నాయి. కొంత కాలం క్రితం వరకు బాగా అలరించిన ఈ సినిమాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఈ నెలలో పలు దెయ్యం సినిమాలు ప్రేక్షకులను భయపెట్టనున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ - ఏప్రిల్ 11న విడుదల
తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో సూపర్ హిట్ అందుకున్న ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ ఈ సినిమా తెరకెక్కింది. శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమాకు దర్శకుడు కోన వెంకట్ కథ, స్రీన్ ప్లే అందించారు. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇవాళ(ఏప్రిల్ 11న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ, హారర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. ఎంవీవీ సినిమాస్ బ్యానర్ తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ తెరకెక్కించారు.
View this post on Instagram
2. ‘లవ్ మీ’ - ఏప్రిల్ 25న విడుదల
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సస్పెన్స్ హారర్, థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ భయపెట్టనుంది. ఈ న్యూ ఏజ్ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
3.’బాక్’ - త్వరలో విడుదల
హారర్ కామెడీ జానర్ లో రూపొందిన ‘అరణ్మనై’ సిరీస్ నుంచి వస్తున్న నాలుగో సినిమా ‘బాక్’. సుందర్ సి హీరోగా నటిస్తూ తెరకెక్కించారు. తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను ఈ నెలలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఏప్రిల్ 26న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఇ.కృష్ణమూర్తి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ‘బాక్’ మూవీలో తమన్నా, రాశీఖన్నాతో పాటు సీనియర్ హీరోయిన్లు కుష్బూ సుందర్, సిమ్రాన్ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు.
View this post on Instagram
Read Also : బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)