Daaku Maharaaj Release Trailer: మర్డర్స్‌లో మాస్టర్స్ చేసిన వైల్డ్ యానిమల్... 'డాకు మహారాజ్' రిలీజ్ ట్రైలర్ చూశారా?
Daaku Maharaaj Release Date: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్' రిలీజ్ ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. అది ఎలా ఉంది? అంటే...

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) చేత ఒక్క పంచ్ డైలాగ్ కూడా చెప్పించకుండా ట్రైలర్ రిలీజ్ చేయడమా? 'డాకు మహారాజ్' (Daaku Maharaaj) ట్రైలర్ చూసి నందమూరి వీరాభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాలయ్య డైలాగ్స్ కంటే కథ మీద, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ మీద దర్శకుడు బాబీ కొల్లి ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. అయితే, సినిమాలో బాలయ్య నుంచి ఆశించే మాస్ కమర్షియల్ అంశాలకు ఎటువంటి లోటు లేదని ఇవాళ విడుదలైన రిలీజ్ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
కింద పడకుండా నరికాడు...
వాడు మనిషి కాదు, వైల్డ్ యానిమల్!
దట్టమైన అడవిలో కార్చిచ్చు గాలి కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఆ మంటల మధ్యలో రౌడీల గుంపు సింహం లాంటి ఒక మనిషి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే... ఆ సింహాన్ని రౌడీలు ఏమీ చేయలేకపోతున్నారు.
'ఒంటిమీద 16 కత్తి పోట్లు... ఆ బాడీలో ఒక బుల్లెట్ కూడా దిగింది... అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే అతను మనిషి కాదు వైల్డ్ యానిమల్' అని షైన్ టామ్ చాకో డైలాగ్ చెప్పిన తర్వాత బాలకృష్ణను స్క్రీన్ మీద చూపించారు. 'నువ్వు కామన్ మ్యాన్ వా? ఐరన్ మ్యాన్ వా?' అని సత్య చెప్పిన డైలాగ్ తర్వాత డాకు ఎపిసోడ్స్ చూపించారు.
మైనింగ్ నేపథ్యంలో సినిమా రూపొందినట్లు 'డాకు మహారాజ్' రిలీజ్ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మైనింగ్ వ్యాపారం చేసే వ్యక్తిగా బాలీవుడ్ నటుడు బాబి డియోల్ కనిపించారు. 'రాయలసీమ తెలుసా నీకు అది నా అడ్డా' అంటూ బాలకృష్ణ హిందీలో చెప్పిన డైలాగ్ బాగుంది.
'ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారు. నేను చంపడంలో చేశా. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్', ఇక ట్రైలర్ చివరిలో 'నువ్వు అరిస్తే బార్కింగ్ (మొరగడం)... నేను అరిస్తే' అని బాలయ్య చెప్పడం ఆ తర్వాత సింహ గర్జన రావడం అభిమానులతో విజిల్స్ వేయించే డైలాగ్.
Also Read: 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
MASS is a mood and he’s the MASTER🔥🪓#DaakuMaharaaj 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 𝐓𝐑𝐀𝐈𝐋𝐄𝐑 is here to set your screens on fire! 🔥
— Sithara Entertainments (@SitharaEnts) January 10, 2025
— https://t.co/849jh9BlA0
𝐉𝐀𝐍 𝟏𝟐, 𝟐𝟎𝟐𝟓 ~ A SANKRANTHI EXPLOSION awaits in cinemas ❤️🔥
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol… pic.twitter.com/qsTNfHjpPm
బాలకృష్ణకు జంటగా ప్రగ్యా జైస్వాల్ నటించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ మరొక హీరోయిన్. ఇందులో చాందిని చౌదరి ప్రత్యేక పాత్ర చేశారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతం దబిడి దిబిడిలో సందడి చేశారు. ఆ పాట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

