అన్వేషించండి
Chiranjeevi: సింగపూర్ వెళ్లిన మెగా కపుల్... చిరు, సురేఖ దంపతులతో పాటు పవన్ ఫోటోలు
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ చదువుతున్న పాఠశాలలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో అతడిని చూసేందుకు మెగా కపుల్ తో పాటు పవన్ వెళ్లారు.
సింగపూర్ వెళ్లిన మెగా కపుల్... చిరు, సురేఖ దంపతులతో పాటు పవన్ కూడా!
1/5

తమ్ముడు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ చదువుతున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, అందులో అతను గాయపడటం తెలిసిన విషయమే. దాంతో అతడిని చూసేందుకు చిరంజీవి సింగపూర్ వెళ్లారు.
2/5

పాఠశాలలో అగ్ని ప్రమాదం జరగడం వల్ల తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కి గాయాలు అయిన సమయంలో జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. అరకు సమీపంలోని కురిడి గ్రామంలో ఉన్నారు. తొలుత ప్రమాద తీవ్రత అంత ఉందని అనుకోలేదని, తర్వాత తెలిసిందని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సింగపూర్ వెళ్లారు.
3/5

మార్క్ శంకర్ గాయపడిన సంగతి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు తక్షణమే సింగపూర్‌కి బయల్దేరారు. శంకర్ ఆరోగ్య పరిస్థితి సమీక్షించడంతో పాటు అక్కడ అవసరమైన మద్దతు అందించేందుకే వెళ్లారు.
4/5

అన్నయ్య చిరంజీవి మీద అభిమానం, గౌరవంతో ఆయన అసలు పేరు కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ లోని శంకర్ తీసుకుని తనయుడికి మార్క్ శంకర్ పవనోవిచ్ అని పేరు పెట్టారు పవన్ కళ్యాణ్.
5/5

సింగపూర్ వెళ్లిన చిరంజీవి... ఎయిర్ పోర్టులో చిరంజీవి ఫోటోలు
Published at : 09 Apr 2025 08:28 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆట
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















