అన్వేషించండి

Chandrababu: పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు

Andhra : పన్నులు ఎగ్గొట్టే వారికి ఏఐతో చెక్ పెట్టాలని చంద్రబాబు సూచించారు. ఆదాయార్జన శాఖలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.

CM Chandrababu Naidu: రాష్ట్రంలో సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయం పెంచుకునేలా, పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు, ఎక్కడ ఆదాయం తక్కువుగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
 
పన్నుఎగవేతలు ఉండకూడదు :

మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించింది. అయితే, తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని చెప్పారు. అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూళ్లు చేయాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. గత ప్రభుత్వంలా వ్యాపారులను వేధించడం కూటమి ప్రభుత్వ విధానం కాదని... వారితో సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులన్నీ చెల్లించేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. పన్నుచెల్లింపుదారులు, జీఎస్టీ పోర్టల్, ఏపీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీసీటీడీ... ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు నోటీసుల జారీకి, గ్రీవెన్స్‌లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింతం వేగం పెంచవచ్చని సూచించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం రూ.1,37,412 కోట్లను 100 శాతం ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని చెప్పారు. 

రాష్ట్ర సొంత ఆదాయంలో 2.2 శాతం వృద్ధి : 

2023-24 ఆర్ధిక సంవత్సరంతో పోల్చుకుంటే 2024-25కి గాను రాష్ట్రానికి సొంతంగా ఆదాయంలో 2.2శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో వృద్ధి 4.1 శాతం పెరగ్గా, పన్నేతర ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. జీఎస్టీలో 4.9శాతం వృద్ధి, ప్రొఫెషనల్ ట్యాక్స్‌లో 15.2శాతం వృద్ధి, ఎక్సైజ్ ఆదాయంలో 24.3 శాతం వృద్ధి నమోదైంది. 

నూతన ఎక్సైజ్ పాలసీ సక్సెస్ :

కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన దగ్గర నుంచి ఆదాయాన్ని పరిశీలిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతం కన్నా మెరుగుపడింది. అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు రూ. 4,330 కోట్ల ఆదాయం రాగా, దాదాపు 33 శాతం ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. అలాగే, మున్సిపల్ శాఖలో 2023-24 కంటే 2024-25లో రూ.500 కోట్లకు పైగా ఆదాయం అదనంగా వచ్చింది. పన్నులకు సంబంధించి ఇంకా సుమారు రూ.2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులకు సంబంధించిన పన్నులు, అలాగే, ఖాళీ స్థలాల పన్నులు అధికంగా వసూలు కావాల్సి ఉన్నాయి. మార్చి నెలలో ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ ప్రకటించడంతో కేవలం 6 రోజుల్లోనే మొత్తం ఆస్తిపన్నులు రూ.240 కోట్లు వసూలయ్యాయని అధికారులు చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి
AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి
Arava Sridhar Resignation: అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 PBKS VS LSG Result Update: శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 
శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Peddi Bhopal Event Live Updates: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Arava Sridhar Resignation: అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
IPL 2026 Mohammed Shami: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా అరుదైన ఘనత
Honda City Facelift News: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కారును పూర్తిగా మార్చేసిన టాప్ 5 మేజర్ అప్‌డేట్స్ ఇవే
కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కారును పూర్తిగా మార్చేసిన టాప్ 5 మేజర్ అప్‌డేట్స్ ఇవే
Embed widget