Viral Video: పోలీస్ స్టేషన్‌లోనే చెప్పుతో కొట్టిన మహిళ - నెల తర్వాత కేసు - వైరల్ వీడియో
Gajuwaka : గాజువాక పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ నరేంద్ర అనే వ్యక్తిని చెప్పుతో కొట్టింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో కేసు నమోదు చేశారు.

Gajuwaka TDP Leader Ananta Lakshmi : విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి గాజువాక పోలీస్ స్టేషన్ లో నరేంద్ర అనే వ్యక్తిపై చెప్పుతో దాడి చేశారు. నరేంద్ర అనే వ్యక్తి సీఐతో మాట్లాడుతున్న సమయంలో నేరుగా లోపలికి వచ్చిన ఆమె నరేంద్రపై కేకేలు వేస్తూ చెప్పు తీసి కొట్టారు. ఈ ఘటన నెల రోజుల కిందట జరిగిందిగా భావిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజీ వెలుగులోకి రావడంతో సంచలనంగా వైరల్ గా మారింది.
విశాఖ టీడీపీ అధ్యక్షురాలు సర్వసిద్ది అనంతలక్ష్మీ నిర్వాకం. గాజువాక పోలీసు స్టేషన్ లో నరేంద్ర అనే వ్యక్తిని చెప్పుతో కొట్టి, సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు బదిలీ చేయిస్తానని బెదిరింపులు.#AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews pic.twitter.com/hhlUFPNQJ8
— Vizag News Man (@VizagNewsman) April 7, 2025
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి జరిగిన తర్వాత వెంటనే నరేంద్ర అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పటికీ ఫిర్యాదు చేయలేదు. దాంతో కేసు నమోదు చేయలేదు. ఆ సమయంలో మహిళా నేత సీఐతోనూ దురుసగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. బదిలీ చేయిస్తానని ఆమె హెచ్చరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులు టీడీపీ నేత అనంతలక్ష్మిపై కేసు నమోదు చేశారు.
నరేంద్రతో అనంతలక్ష్మికి వివాదం ఏమిటి ?
అయితే నరేంద్ర అనే వ్యక్తితో అనంతలక్ష్మికి ఉన్న వివాదం ఏమిటో.. ఏ అంశంపై వారు పోలీస్ స్టేషన్ కు వచ్చి మాట్లాడుతున్నారన్న దానిపై వివరాలు వెలుగులోకి రాలేదు. ఈ అంశషంపై పోలీసులు స్పందించ లేదు. దాడికి గురైన వ్యక్తి తమ పార్టీ నేత వైఎస్ఆర్‌సీపీ ప్రకటించుకుంది. తమ పార్టీ నేతపై పోలీస్ స్టేషన్ లోనే చెప్పుతో మహిళా నేత దాడి చేశారని.. ఆమె జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారని.. మరి చర్చలు తీసుకోరా.. కేసు పెట్టరా అని టీడీపీ ని ప్రశ్నించింది.
సీఐని కూడా అనంత లక్ష్మి బెదిరించినట్లుగా ఆరోపణలు
అనంతలక్ష్మిపై సెక్షన్ 323 కింద గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద కేసు నిరూపణ అయితే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అసలు ఈ దాడి ఘటన ఎందుకు జరిగిందో అటు వైసీపీ నేత నరేంద్ర కానీ.. ఇటు అనంత లక్ష్మి కానీ మీడియా ముందు ఎలాంటి ప్రకటన చేయలేదు. వారి మధ్య ఉన్న వ్యక్తిగత వివాదాల విషయంలోనే ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. పోలీసులు చట్ట పరంగా కేసులు నమోదు చేయడంతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినట్లయింది.





















