Jack Twitter Review - జాక్ ట్విట్టర్ రివ్యూ: టిల్లు సక్సెస్ జోరుకు బ్రేకులు... సోషల్ మీడియాలో సిద్ధూ 'జాక్' సినిమా టాక్ ఎలా ఉందంటే?
Jack Movie Review Telugu: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ఆయన లేటెస్ట్ సినిమా జాక్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. దాని ఆడియన్స్ రివ్యూ

Siddhu Jonnalagadda's Jack Review In Telugu: స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన 'జాక్' సినిమా ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు ఓవర్సీస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న హీరో జోరుకు ఈ సినిమా బ్రేకులు వేసిందని సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటే అర్థం అవుతోంది.
స్పై యాక్షన్ కామెడీ...
డిజప్పాయింట్ చేసింది!
స్పై యాక్షన్ కామెడీగా రూపొందిన 'జాక్' సినిమా డిజప్పాయింట్ చేసిందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. సినిమా చాలా బోరింగ్ అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. ఈ సినిమాకు 2/5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. మెజారిటీ జనాలు అదే రేటింగ్ ఇస్తున్నారు. కొందరు 2.25/5 రేటింగ్ ఇస్తున్నారు.
#Jack boring 😤 😤
— RK (@rk_dublin) April 9, 2025
My Rating: 2/5 ⭐️⭐️ pic.twitter.com/5bZLnq7U8w
భాస్కర్ గారు... ఏంటిది?
'వాళ్లు రా ఏజెంట్స్ అనుకున్నారా లేక టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ అనుకున్నారా?' అంటూ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarollu Bhaskar)ని ప్రశ్నించాడు ఒక నెటిజన్. సినిమాలో దర్శకత్వం మీద చాలా మంది సెటైర్లు వేస్తున్నారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్, దేశభక్తి, మదర్ సెంటిమెంట్ - ఇంటర్వెల్ అయ్యే సరికి చాలా ఎమోషన్స్ దర్శకుడు టచ్ చేసినప్పటికీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదని మరొక నెటిజన్ పేర్కొన్నాడు. సెకండ్ ఆఫ్ చూస్తే ఇల్లాజికల్ అనిపించిందని మరొకరు పేర్కొన్నారు.
వాళ్ళు RAW ఏజెంట్స్ అనుకున్నారా….లేక 2-టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ అనుకున్నారా, భాస్కర్ గారు? #Jack
— Aakashavaani (@TheAakashavaani) April 9, 2025
#Jack - First Half - Action, comedy, romance, patriotism, and even mother sentiment, director Bhaskar tried almost everything, but unfortunately, nothing worked out barring a few laughs from Siddhu.
— Gulte (@GulteOfficial) April 9, 2025
'రా'ని రోత చేస్తే ఎలా?
'జాక్' కథ మీద సరిగా వర్కౌట్ చేయలేదని విమర్శ ఎక్కువ మంది నుంచి వినపడుతోంది. 'రా ఏజెంట్స్ అంటే రాయల్ కింద చూపించాలి ఇలా రోత కాదు' అంటూ ఒక నెటిజన్ పేర్కొన్నాడు. ప్రతిసారి వన్ లైనర్స్, పంచ్ డైలాగులతో సినిమా వర్కౌట్ అవ్వదని, ఇక ఎప్పటికీ అర్థం అవుతుందోనని హీరో సిద్దు జొన్నలగడ్డ మీద సెటైర్ వేశాడు. ఎంత చెప్పినా థియేటర్లలో చూస్తా అంటే వెళ్లి మాలాగా బలవమని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
#JACK - Half baked story which lacks connectivity
— 𝑺𝒖𝒋𝒆𝒆𝒗.𝑮 (@sujeev_Nani) April 9, 2025
RAW ni Royal ga chupinchali ila Rotha kadhu 🙏😭
Prathi sari one liners tho cinema workout avvadhu Ani
Inka yeppatiki ardam avvudho emo 🥱
Intha cheppinaka kuda Theatre lo chusta ante
velli ma laga Bugga avvandi #Tollywood pic.twitter.com/JX8h1lCMXD
సినిమాలో అటు కామెడీ వర్కౌట్ కాలేదని, అదే సమయంలో స్పై సీన్లు కూడా సరిగా కుదరలేదని మరొక నెటిజన్ తెలిపాడు. ఈ కథలో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కమర్షియల్ అంశాలు అన్ని ట్రై చేశాడని, అయితే ఒక్కటి కూడా వర్క్ అవుట్ కాలేదని, స్క్రీన్ ప్లే క్లంజిగా ఉందని తెలిపాడు. హీరో సిద్ధూ జొన్నలగడ్డ తన భుజాల మీద సినిమాను మోయాలని ప్రయత్నించినప్పటికీ డైలాగులు గానీ రైటింగ్ గానీ సపోర్ట్ చేయలేదని టాక్. స్పై పోర్షన్ అయితే ఇరిటేట్ చేస్తుందట. మ్యూజిక్ అసలు బాలేదట. థియేటర్లలో కూర్చోవడం కష్టమే అంటున్నారు.
Show completed:- #jack
— venkatesh kilaru (@kilaru_venki) April 9, 2025
My rating 2.25/5
Half baked Raw movie
Illogical scenes in 2nd half pic.twitter.com/1Xq7al7OoY
#Jack
— praveen chowdary kasindala (@kpcuk1997) April 9, 2025
Is a par average flick saved by #SiddhuJonnalagadda
Good thing is its out of usual #BommarilluBhaskar zone.
+ve: siddu, comedy in parts and bgm
-ve: weak vfx lack of connectivity
Overall: 2.25/5 pic.twitter.com/MECXwPMtvn
#Jack is a spy action comedy that disappoints big time as both the spy portions and comedy fail to deliver for the most part.
— Venky Reviews (@venkyreviews) April 9, 2025
Director Bhaskar tried to pack all commercial aspects in this film but none of them could make a solid impact because of the clumsy screenplay and weak…





















