అన్వేషించండి

AA22 x A6: అవేంజర్స్, ఎక్స్ మ్యాన్... అట్లీతో ఐకాన్ స్టార్ ప్లానేంటి? సైన్స్‌ ఫిక్షన్ సినిమాయేనా... వీఎఫ్ఎక్స్‌ కంపెనీల హిస్టరీ తెల్సా?

Allu Arjun Atlee Movie: అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించే సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అమెరికాలోని వీఎఫ్ఎక్స్ స్టూడియో ప్రతినిధులతో మాట్లాడారు. అందులో ఇవి గమనించారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా (AA22 Movie) చేయనున్నట్లు తెలిపారు. అమెరికా వెళ్లిన హీరో, దర్శకుడు... అక్కడి వీఎఫ్ఎక్స్ స్టూడియో ప్రతినిధులతో మాట్లాడారు. హాలీవుడ్‌లో ఆ వీఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఏయే సినిమాలకు పని చేశాయో తెలుసా? ఆ వీడియోలో బోలెడు హిడెన్ డీటెయిల్స్ ఇచ్చారు. గమనించారా?

మేకప్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్...
ఆస్కార్ నామినేషన్!
అమెరికా వెళ్లిన అల్లు అర్జున్ & అట్లీ కేవలం వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో మాత్రమే సమావేశం కాలేదు. స్పెషల్ మేకప్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌లను కూడా కలిశారు. స్పెక్ట్రల్ మోషన్ అని ఓ కంపెనీని చూపించారు కదా! దాని కో ఫౌండర్ పేరు మైక్ ఎలిజల్డ్. 'హెల్ బాయ్ 2: ది గోల్డెన్ ఆర్మీ' సినిమాకు గాను ఆయనకు ఆస్కార్ నామినేషన్ కూడా లభించింది. 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' వంటి సినిమాలకూ ఆయన పని చేశారు. సో... అల్లు అర్జున్ సినిమాలో మేకప్‌కు ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట.

అట్లీ లాస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా 'జవాన్'. షారుఖ్ ఖాన్‌ ముఖానికి బ్యాండేజ్ తరహాలో కట్టి పేస్ కనిపించకుండా లుక్ మీద క్యూరియాసిటీ కలిగించారు. మరి, ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఎలా ప్లాన్ చేస్తున్నారో? హెల్ బాయ్ ఫేస్ గుర్తు ఉందా? ఆ తరహాలో విలన్ క్యారెక్టర్స్ ఏమైనా ప్లాన్ చేశారా? మైక్ ఎలిజల్డ్ అయితే ఇటువంటి కథను ఇప్పటి వరకు చదవలేదని అంటున్నారు. ఆయన మాటలు అంచనాలు మరింత పెంచాయి.

AA22 x A6: అవేంజర్స్, ఎక్స్ మ్యాన్... అట్లీతో ఐకాన్ స్టార్ ప్లానేంటి? సైన్స్‌ ఫిక్షన్ సినిమాయేనా... వీఎఫ్ఎక్స్‌ కంపెనీల హిస్టరీ తెల్సా?

లోలా వీఎఫ్ఎక్స్ కంపెనీ...
ఒక్క జానర్ అని చెప్పలేం!
అల్లు అర్జున్ - అట్లీ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో ఫస్ట్ చూపించిన కంపెనీ లోలా వీఎఫ్ఎక్స్. లాస్ ఏంజిల్స్ సిటీలో బేస్ స్టూడియో ఉంది. ఇంకా న్యూయార్క్, లండన్, న్యూ ఓర్లీన్స్ సిటీల్లోనూ ఆఫీసులు ఉన్నాయి. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ', కమల్ హాసన్ 'ఇండియన్ 2', 'ఇండియన్ 3' సినిమాలకు ఆ కంపెనీ వర్క్ చేసింది. అయితే... లోలా వీఎఫ్ఎక్స్ చేసిన హాలీవుడ్ సినిమాల లిస్ట్ చూస్తే... మైండ్ బ్లాక్ అవుతుంది.

AA22 x A6: అవేంజర్స్, ఎక్స్ మ్యాన్... అట్లీతో ఐకాన్ స్టార్ ప్లానేంటి? సైన్స్‌ ఫిక్షన్ సినిమాయేనా... వీఎఫ్ఎక్స్‌ కంపెనీల హిస్టరీ తెల్సా?
లోలా కంపెనీని ఒక్క జానర్ సినిమాలకు పని చేసిందని పరిమితం చేయలేం. డిస్నీ, మార్వెల్ తీసిన సినిమాలు చేసింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలో యాక్షన్ సినిమాలకూ వర్క్ చేసింది. జేమ్స్ బాండ్ సినిమా 'నో టైమ్ టు డై' కూడా వాళ్ళ ఖాతాలో ఉంది. 'ఎక్స్ మెన్' ఫ్రాంచైజీలో సినిమాలు కూడా చేశారు. టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ సినిమాలూ ఉన్నాయి. ఐరన్ హెడ్ స్టూడియోస్ కూడా మార్వెల్ సినిమాలతో పాటు పలు బ్లాక్ బస్టర్ సినిమాలకు పని చేసింది.

లెగసీ ఎఫెక్ట్స్...
ఎమ్మా అవార్డు విన్నర్స్!
అల్లు అర్జున్ & అట్లీ వెళ్లిన స్టూడియోల్లో లాస్ ఏంజిల్స్ సిటీలోని 'లెగసీ ఎఫెక్ట్స్' ఒకటి. కమల్ 'ఇండియన్ 2'కూ ఈ కంపెనీ వర్క్ చేసింది. స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 'ది మాండలోరియన్', 'ది బుక్ ఆఫ్ బోబ ఫెట్' సినిమాలకు ఎమ్మా అవార్డ్స్ కూడా అందుకున్నారు.

AA22 x A6: అవేంజర్స్, ఎక్స్ మ్యాన్... అట్లీతో ఐకాన్ స్టార్ ప్లానేంటి? సైన్స్‌ ఫిక్షన్ సినిమాయేనా... వీఎఫ్ఎక్స్‌ కంపెనీల హిస్టరీ తెల్సా?
ఆస్కార్ విన్నర్స్ గురూ...
ఆ కంపెనీ హిస్టరీ సూపర్!
లాస్ట్, బట్ నాట్ లీస్ట్... ఫ్రాక్చర్డ్స్ ఎఫ్ఎక్స్ కంపెనీ. 'ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫాయే'కు గాను ఈ కంపెనీ 2022లో ఆస్కార్ అవార్డు అందుకుంది. అదీ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ విషయంలో! ఆ సినిమాకు బాఫ్టా అవార్డు కూడా వచ్చింది. ఇంకా పలు అవార్డులు, నామినేషన్లు ఉన్నాయి. 'ఆక్వా మ్యాన్', 'రెబల్ మూన్', 'వెస్ట్ వరల్డ్', ఆర్మీ ఆఫ్ ది డెడ్' వంటి సినిమాలకు వర్క్ చేశారు.

Also Read: ఎవరీ సాయి అభ్యంకర్? అల్లు అర్జున్ సినిమాకు మ్యూజిక్ చేసే ఛాన్స్ కొట్టేసిన 20 ఏళ్ల కుర్రాడు ఎవరో తెలుసా?

అల్లు అర్జున్, అట్లీ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో కంపెనీలను గమనిస్తే... ఆ కంపెనీల్లో చేసిన సినిమాల్లో కామన్ ఫిలిమ్స్ కొన్ని ఉన్నాయి. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన అవెంజర్స్ అండ్ ఎక్స్ మ్యాన్ సిరీస్. వీడియో మధ్యలో 'అవతార్' చూపించినా... కాస్త నిశితంగా గమనిస్తే? 'ఎక్స్ మ్యాన్' సిరీస్ సినిమాల్లో హీరో చేతి నుంచి హ్యూ జాక్ మన్ చేతి వేళ్ళలో నుంచి పదునైన ఇనుప చువ్వలు వంటివి వస్తాయి కదా! వీడియో మధ్యలో అల్లు అర్జున్ చేతికి ఎక్స్‌టెన్షన్, పొడవాటి వేళ్ళు కనిపిస్తాయి. వీడియో చివరలో అల్లు అర్జున్ అరవడం చూస్తే... హ్యూ జాక్ మన్ క్యారెక్టర్ తరహాలో ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో!? హెల్ బాయ్ తరహాలో గెటప్స్ ఏమైనా ప్లాన్ చేశారేమో!? అవెంజర్స్ తరహా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండొచ్చు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ కంపెనీలతో ఏం ప్లాన్ చేస్తున్నారో మరి!? 

సాధారణంగా అట్లీ అంటే మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ సారి రూటు మార్చి సైన్స్ ఫిక్షన్ సినిమా ప్లాన్ చేశారట. ఆడియన్స్, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆశించే కమర్షియల్ విలువలతో పాటు  వరల్డ్ ఆడియన్స్‌ను సైతం మెప్పించే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ఒకటి యాడ్ చేశారట. అది ఎలా ఉంటుందో చూడాలి.

Also Readఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget