Chiranjeevi Mother Birthday: మెగాస్టార్ ఇంట ఘనంగా బర్త్ డే వేడుక... తల్లి అంజనా దేవికి చిరు సర్‌ప్రైజ్
Chiranjeevi Mother Anjana Devi Date Of Birth: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా కేక్ కట్ చేయించారు.
![Chiranjeevi Mother Birthday: మెగాస్టార్ ఇంట ఘనంగా బర్త్ డే వేడుక... తల్లి అంజనా దేవికి చిరు సర్‌ప్రైజ్ Chiranjeevi celebrates his mother Anjana Devi birthday with family members Ram Charan Upasana Surekha Watch video Chiranjeevi Mother Birthday: మెగాస్టార్ ఇంట ఘనంగా బర్త్ డే వేడుక... తల్లి అంజనా దేవికి చిరు సర్‌ప్రైజ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/b0ba8925b4958074eb6b647d3f1a418a1738163717691313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మెగాస్టార్ చిరంజీవి ఇంట సంతోషం వెల్లి విరిసింది. చిరు చెల్లెళ్లతో పాటు కుటుంబ సభ్యులు అందరూ ఈ రోజు మెగా ఇంటికి వచ్చారు. ఎందుకంటే... అంజనా దేవి పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేయడం కోసం!
అంజనా దేవిని సర్‌ప్రైజ్ చేసిన చిరు!
జనవరి 29... పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి జన్మించిన రోజు. అమ్మ బర్త్ డే సందర్భంగా కుటుంబ సభ్యులు అందరినీ ఇంటికి పిలిచి వైభవంగా కేక్ కట్ చేయించారు.
అంజనా దేవి మెగాస్టార్ ఇంట అడుగు పెట్టడమే గులాబీ రేకులు ఆమె మీద చల్లుతూ స్వాగతం పలికారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరి సమక్షంలో కేక్ కట్ చేయించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు చిరు చెల్లెళ్లు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
View this post on Instagram
Chiranjeevi Upcoming Movies: ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాలకు వస్తే... కళ్యాణ్ రామ్ హీరోగా 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తీసిన వశిష్ట మల్లిడి దర్శకత్వంలో 'విశ్వంభర' చేస్తున్నారు. చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా అంగీకరించారు. అయితే నాని హీరోగా ఆ దర్శకుడు తీస్తున్న సినిమా పూర్తి అయిన తరువాతే చిరు సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఈ మధ్యలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది.
Ram Charan Upcoming Movies: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే... 'ఉప్పెన' వంటి 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా తీసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత తనకు 'రంగస్థలం' వంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. ప్రస్తుతానికి చరణ్ అంగీకరించిన సినిమాలు ఈ రెండే.
Also Read: 'దిల్' రాజుకు రామ్ చరణ్ మరో సినిమానా? సారీ... ప్రజెంట్ కమిట్మెంట్ ఏదీ లేదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)