Brahma Anandam Trailer: ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
Brahma Anandam Trailer: తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్.. తాతామనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. సోమవారం రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

Brahma Anandam Movie: బ్రహ్మానందం.. మీమ్స్ గాడ్. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ మధ్య పోషించే పాత్రలు, ఆయనకు ఎంతో వన్నె తెస్తున్నాయి. తనని కామెడీ కింగ్‌ని చేసిన కామెడీని వదలకుండానే.. హుందా పాత్రలలో నటిస్తూ, తను కమెడియన్‌ని మాత్రమే కాదు.. తనలో అన్ని రకాల నటుడు దాగి ఉన్నాడని నిరూపించుకుంటున్నారు బ్రహ్మానందం. అందుకు ఉదాహరణే ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రంగమార్తాండ’ చిత్రం. ఆ చిత్రం తర్వాత మరోసారి బ్రహ్మానందం.. తనలోని వైవిధ్య నటుడిని బయటకు తీస్తున్నారు. ఈసారి స్పెషల్ ఏంటంటే.. తన కుమారుడు రాజా గౌతమ్ (‘పల్లకిలో పెళ్లికూతురు’ మూవీ హీరో) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రంలో, ఆయనకు తాతగా బ్రహ్మి తనదైన నటనతో రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆ విషయం తెలియజేయగా.. సోమవారం రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా వదిలిన ట్రైలర్ ఆ విషయాన్ని మరింతగా స్పష్టం చేస్తుంది. ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రభాస్.. టీమ్‌ను అభినందిస్తూ.. బ్రహ్మానందం నటనను కొనియాడారు. అలాగే బ్రహ్మానందం ఇన్‌స్టా ఎంట్రీకి స్వాగతం పలికారు.
‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఆద్యంతం నవ్విస్తూనే ఎమోషనల్‌కు గురి చేస్తుందీ ట్రైలర్. ముఖ్యంగా బ్రహ్మానందంలో దాగి ఉన్న గొప్ప నటుడిని ఈ ట్రైలర్ పరిచయం చేస్తుంది. బ్రహ్మానందం అంటే కేవలం కామెడీనే అనుకునే వారికి.. తన మ్యాజిక్ పెర్ఫార్మెన్స్‌తో కంటతడి పెట్టిస్తున్నాడు. తండ్రీకొడుకులు, తాతా మనవళ్లుగా నటించిన ‘బ్రహ్మా ఆనందం’ ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అనే విషయం ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేస్తుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి, స్వార్థపరుడిగా పెరిగిన రాజా గౌతమ్.. థియేటర్ ఆర్టిస్ట్ కావాలనుకుంటాడు. అందుకు దాదాపు రూ. 6 లక్షలు కావాల్సి వస్తుంది. అతని దగ్గర అంత డబ్బు ఉండదు. అదే సమయంలో అతనికి ఓ ఏజ్డ్ పర్సన్ (బ్రహ్మానందం) పరిచయమై, తన 6 ఏకరాల పొలం ఇచ్చేస్తాని చెప్పి ఓ కండీషన్ పెడతాడు. ఓ 10 రోజుల పాటు స్వార్థం పక్కన పెట్టి.. పక్కనున్న వారి కోసం ఆలోచించాలనే కండీషన్‌తో మనవడిలో తాత మార్పు తీసుకువస్తాడా?.. వారి జర్నీ ఎమోషనల్‌గా సాగడానికి కారణం ఏంటి? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లుగా ట్రైలర్ తెలియజేస్తుంది.
Also Read: మూవీ లవర్స్‌కు నిజంగా 'వాలెంటైన్స్ డే' - అటు థియేటర్ ఇటు ఓటీటీల్లో ఈ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేయండి!
తన డ్రీమ్ కోసం డబ్బులు అవసరపడటంతో.. తాత చెప్పిన ఎలాంటి పనైనా చేసే మనవడి పాత్రలో రాజా గౌతమ్ నటన, డైలాగ్స్ అన్నీ కూడా వావ్ అనేలా ఉన్నాయి. మనవడిలో మార్పు కోసం అతడిని ఇబ్బంది పెట్టే పాత్రలో బ్రహ్మానందం ఎంతగానో ఒదిగిపోయారు, ఎంతో నలిగిపోయారనే ఎమోషనల్ సన్నివేశాలతో పాటు ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ కాకుండా దర్శకుడు ఆర్.వి.ఎస్. నిఖిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడనే విషయం ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం తెలియజేస్తుంది. వెన్నెల కిషోర్ పాత్రతో పాటు సంపత్, రాజీవ్ కనకాల పాత్రలకు కూడా ఈ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎమోషనల్ జర్నీలో రాజా గౌతమ్‌కు ఓ లవ్ ట్రాక్‌ని కూడా దర్శకుడు సెట్ చేశాడు. అది కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుండటం విశేషం. మొత్తంగా అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ.. ఈ సినిమా తెరకెక్కిందనే విషయాన్ని తెలియజేయడంలో ఈ ట్రైలర్ వందశాతం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
వరుస హిట్స్.. ‘మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి వస్తున్న చిత్రమిది. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో.. నూతన దర్శకుడు Rvs నిఖిల్ దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రాన్ని.. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది. ‘పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు, క’ వంటి చిత్రాల తరువాత వంశీ నందిపాటి ఈ మూవీని ఫ్యాన్సీ రేటుకు హక్కుల్ని చేజిక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

