అన్వేషించండి

Vaishnavi Chaitanya: బస్తీ పోరి ‘బేబీ’గా ఎలా మారింది? వైష్ణవి చైతన్య గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

వైష్ణవి చైతన్య గురించి సినీ అభిమానులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. టిక్‌ టాక్‌ వీడియోలు, షార్ట్‌ ఫిలింస్‌ చూసే వారికి సుపరిచితమే. 'బేబీ'తో సంచలనంగా మారిన ఈ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలు..

'బేబీ' సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. ఒక్క సినిమాతోనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. తొలి చిత్రంతోనే కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్ అయింది. పలు రకాల షేడ్స్ ఉన్న పాత్రని అద్భుతంగా పండించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు వైష్ణవి ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి ఎలా వచ్చింది? వంటి విషయాల గురించి తెలుసుకోడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

వైష్ణవి చైతన్య ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రాంతానికి చెందిన పదహారణాల తెలుగమ్మాయి. మొదట్లో డబ్స్ మాష్ యాప్ లో వీడియోలు చేయడం ప్రారంభించిన ఆమె.. టిక్ టిక్ వీడియోలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అలానే తన పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి, ఫన్నీ కామిక్ వీడియోలు పోస్ట్ చేస్తూ వచ్చింది. ఈ విధంగా టిక్ టాక్ స్టార్ గా, యూట్యూబర్ గా సోషల్ మీడియాలో తనకంటూ ఒక సర్కిల్ క్రియేట్ చేసుకుంది. 

సోషల్ మీడియాలో వైష్ణవి చైతన్య పాపులారిటీ చూసి, ఇన్ఫినిటమ్ మీడియా అనే సంస్థ ఆమెతో పని చేయటానికి ఆసక్తి కనబరిచింది. ఈ క్రమంలోనే అమ్మడు పలు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలు, కవర్ సాంగ్స్ లో మెరిసింది. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ‘బిగ్ బాస్’ ఫేమ్ షణ్ముక్‌తో కలసి నటించిన 'సాఫ్ట్ వేర్ డెవలపర్' టీవీ సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలానే 'మిస్సమ్మ' అనే వెబ్ మూవీతో ఆకట్టుకుంది.

2018లో 'టచ్ చేసి చూడు' అనే సినిమాతో తొలిసారిగా బిగ్ స్క్రీన్ మీద కనిపించింది వైష్ణవి చైతన్య. అందులో రవితేజ రెండో చెల్లెలిగా చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత 'అల వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ సోదరిగా కనిపించిన ఈ బ్యూటీ.. టక్ జగదీశ్, వరుడు కావలెను, రంగ్ దే, ప్రేమదేశం వంటి పలు చిత్రాల్లో నటించింది. అజిత్ హీరోగా తెరకెక్కిన 'వాలిమై' తమిళ్ మూవీలోనూ చిన్న క్యారెక్టర్ పోషించింది. ఈ క్రమంలో ఇప్పుడు 'బేబీ' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.

Read Also: Bigg Boss Telugu 7: కుడి ఎడమైతే పొరపాటు లేదో, 'బిగ్ బాస్' ప్రోమోతో తిరిగొచ్చిన కింగ్ నాగ్!

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలతో సాయి రాజేశ్ తెరకెక్కించిన సినిమా 'బేబీ'. గత శుక్రవారం విడుదలైన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ.. నాలుగు రోజుల్లోనే 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. డెబ్యూ సినిమాలో వైష్ణవి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజమైన ప్రేమకు, మోహానికి మధ్య నలిగిపోయే ఈ తరం అమ్మాయి పాత్రను ఆమె చక్కగా పోషించింది. ఓవైపు డీగ్లామర్ గా కనిపిస్తూనే, మరోవైపు గ్లామరస్ గా అదరగొట్టింది. ఈ క్రమంలో రొమాంటిక్ సీన్స్, బోల్డ్ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి కూడా వెనకాడలేదు. ఇవన్నీ సినిమా విజయానికి దోహదం చేయడమే కాదు, వైష్ణవికి పేరు తెచ్చిపెట్టాయి.

'బేబీ' విజయంతో వైష్ణవి చైతన్య ఫుల్ ఖుషీగా ఉంది. డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకోవడం.. సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎక్కడో ఒక బస్తీ నుంచి టిక్ టాక్ వీడియోలు చేసుకొంటూ ఇంత దూరం వచ్చానని.. ఈ ప్రయాణానికి ఎనిమిదేళ్లు పట్టిందని వైష్ణవి చెబుతోంది. ఇప్పటి వరకూ ఎన్నో ఇబ్బందులు చూశానని.. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా నిలబడగలననే ధైర్యం తన గతం తనకు ఇచ్చిందని అంటోంది. నిజానికి హీరోయిన్ అవ్వాలనో, ఏదేదో చేసేయాలనో తనకు లేదని.. సినిమాల్లోకి రావాలని, స్థిరపడాలనే ఆశ మాత్రమే ఉండేదని చెప్పింది. అయితే ఇప్పుడు 'బేబీ' సినిమా అంతకు మించి గుర్తింపు ఇచ్చిందని తెలిపింది.

ప్రేక్షకుల అరుపులు, చప్పట్ల మధ్య ఫస్ట్ డే థియేటర్లో సినిమా చూస్తుంటే, కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది. అంత పెద్ద స్క్రీన్ పై చూసుకొన్న తర్వాత.. ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసింది ఈ రోజు కోసం కదా అనిపించిందని.. బేబీ విడుదలైన జూలై 14 నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు అని వైష్ణవి చెప్పింది. తెలుగమ్మాయి అద్బుతంగా చేసిందని అందరూ అంటుంటే మస్త్ ఖుషీగా వుంది. తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు రావనే విషయం ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. అలాంటి మాటలు విని ప్రయత్నం చేయకుండా చాలా మంది ఆగిపోయిన వారున్నారు. సినిమా రంగంలో రాణించాలంటే ప్రతీ ఒక్కరూ ట్రై చెయాలి. నాకు సాయి రాజేష్, ఎస్కేఎన్ దొరికినట్టుగా, గట్టిగా ప్రయత్నించిన వారికి కూడా ఎవరో ఒకరు దొరుకుతారని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది.

ఇటీవల ఓ ఇంటర్వూలో వైష్ణవి మాట్లాడుతూ.. తన తొలి పారితోషికం రూ.700 అని చెప్పింది. ఒక ఈవెంట్ కోసం డ్యాన్స్ చేసే అవకాశం వస్తే.. రోజంతా కష్టపడితే ఏడొందల రూపాయలు ఇచ్చారని తెలిపింది. అలా తన ఫస్ట్ జర్నీ మొదలైందని పేర్కొంది. కానీ ఇప్పుడు ఎంత సంపాదించినా తన ఫస్ట్ రెమ్యునరేషన్ తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది. 'బేబీ' సక్సెస్ తో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కడతున్నాయని తెలుస్తోంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తెలుగమ్మాయి తన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి!

Read Also: Cult Films: ‘కల్ట్’ సినిమా? ఇప్పుడిదే నయా ట్రెండ్ - ఈ సినిమాలకు ఆ క్రెడిట్ ఇవ్వొచ్చు అంటారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Dharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget