Hyderabad News: భర్త, అత్తమామల వేధింపులు - సెల్ఫీ వీడియో తీసుకుని వైద్యురాలి ఆత్మహత్యాయత్నం, హైదరాబాద్‌లో ఘటన
Crime News: హైదరాబాద్‌లో ఓ వైద్యురాలు తన భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
![Hyderabad News: భర్త, అత్తమామల వేధింపులు - సెల్ఫీ వీడియో తీసుకుని వైద్యురాలి ఆత్మహత్యాయత్నం, హైదరాబాద్‌లో ఘటన the doctor attempted suicide by taking a selfie video Unable to bear the harassment of her husband and in laws in hyderabad Hyderabad News: భర్త, అత్తమామల వేధింపులు - సెల్ఫీ వీడియో తీసుకుని వైద్యురాలి ఆత్మహత్యాయత్నం, హైదరాబాద్‌లో ఘటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/d1fb6e9519a64172684ec8c746d3fb921738117230174876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lady Doctor Attempted Suicide By Taking Selfie Video In Hyderabad: భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారంటూ ఓ వైద్యురాలు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన హైదరాబాద్‌లో (Hyderabad) మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రణీత అనే వైద్యురాలు తనను భర్త సుఖేందర్ రెడ్డి, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ సెల్ఫీ వీడియో తీసింది. అందులో వేధింపుల గురించి ప్రస్తావిస్తూ కన్నీటి పర్యంతమైంది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు న్యాయం జరగదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే ఆమెను కర్మన్ ఘాట్ జీవన్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి వద్ద వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)