Stocks To Watch Today 23 November 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Honasa, IndiGo, SBI, Infy
US ఆర్థిక వ్యవస్థ స్థిమితపడుతోందని, మాంద్యాన్ని నివారించేందుకు తగినంత బలంగా ఉండవచ్చని ఆర్థిక డేటా సూచించడంతో, ఫెడ్ రేట్ల పెంపు పూర్తి అయిందన్న ఆశతో నిన్న US మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
Stock Market Today, 23 November 2023: ఆసియా మార్కెట్ల మిక్స్‌డ్ క్యూస్ నేపథ్యంలో, మన మార్కెట్‌లో ఈ రోజు (గురువారం) ట్రేడింగ్ జాగ్రత్తగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ కాబట్టి, మార్కెట్‌లో అస్థిరత పెరిగే అవకాశం ఉంది.
US ఆర్థిక వ్యవస్థ స్థిమితపడుతోందని, మాంద్యాన్ని నివారించేందుకు తగినంత బలంగా ఉండవచ్చని ఆర్థిక డేటా సూచించడంతో, ఫెడ్ రేట్ల పెంపుతో పూర్తి అయిందన్న ఆశతో నిన్న US మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
ఆసియన్ మార్కెట్లలో... నిక్కీ, కోస్పి, తైవాన్ 0.1% - 0.3% శాతం లాభపడగా, హాంగ్ సెంగ్, షాంఘై సూచీలు 0.7 శాతం వరకు పడిపోయాయి.
ఈ రోజు ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 02 పాయింట్లు లేదా 0.01% రెడ్ కలర్‌లో 19,896 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
హోనస కన్స్యూమర్: మామాఎర్త్ మాతృ సంస్థ హోనస కన్స్యూమర్, Q2 FY24లో రూ. 29.40 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ. 15 కోట్ల నికర నష్టంలో ఉంది. Q2 FY24లో ఏకీకృత ఆదాయం 21 శాతం వృద్ధితో రూ. 496.10 కోట్లకు చేరుకుంది.
ఇంటర్‌గ్లోబల్ ఏవియేషన్: ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, రూ. 1,666 కోట్ల విలువైన టాక్స్ డిమాండ్‌ను సవాలు చేయాలని యోచిస్తోంది. "AY 2016-17 కోసం రూ.7,39.68 కోట్లు, AY 2017-18 కోసం రూ.9,27.03 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అసెస్సింగ్ ఆఫీసర్ చెప్పారని, దీనిపై CIT-అప్పీల్‌కు వెళ్లాలని అనుకుంటున్నామని" రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ కంపెనీ వెల్లడించింది.
లిబర్టీ షూస్: పిటిషన్ దాఖలు చేయడానికి మినహాయింపు కోరుతూ లిబర్టీ షూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశ్ కుమార్ గుప్తా చేసుకున్న విజ్ఞప్తిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) కొట్టివేయడంతో, గుప్తాను డైరెక్టర్ల బోర్డు నుంచి తొలగించారు.
ఇన్ఫోసిస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఫస్ట్ స్ట్రాటెజీ ద్వారా డిజిటల్‌కు మారేందుకు సాయం చేయడానికి, TK ఎలివేటర్‌తో ఇన్ఫోసిస్ ఒక వ్యూహాత్మక దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించలేదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): వ్యక్తిగత రుణాల వంటి అసురక్షిత రుణాలపై వడ్డీ రేట్లను పెంచాలని యోచిస్తోంది. అన్‌సెక్యూర్డ్ లోన్లకు అధిక రిస్క్ వెయిట్‌ను రిజర్వ్ బ్యాంక్ (RBI) పెంచడంతో, ఎస్‌బీఐ ఈ దిశగా ఆలోచిస్తోంది. సురక్షిత రుణాలకు రిస్క్ వెయిటేజీ పెరుగుదల వల్ల SBI నికర వడ్డీ మార్జిన్ (NIM) మీద 2-3 బేసిస్ పాయింట్ల ప్రభావం చూపుతుందని బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖరా చెప్పారు.
ఈరోజు F&O నిషేధంలో స్టాక్స్: BHEL, హింద్ కాపర్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా సిమెంట్స్, మణప్పురం ఫైనాన్స్, MCX, NMDC, RBL బ్యాంక్, Zee ఎంటర్‌టైన్‌మెంట్.
మరో ఆసక్తికర కథనం: మూడు వారాల్లో 38 లక్షల పెళ్లిళ్లు - ఖర్చు రూ.4.74 లక్షల కోట్లు