అన్వేషించండి

Wedding Season: మూడు వారాల్లో 38 లక్షల పెళ్లిళ్లు - ఖర్చు రూ.4.74 లక్షల కోట్లు

ఈ ఏడాది నవంబర్‌ 23, 24, 27, 28, 29 తేదీలు, డిసెంబర్‌లో 3, 4, 7, 8, 9, 15 తేదీలు శుభప్రదంగా ఉన్నాయి.

Wedding season - Business in India: ఈ ఏడాది దసరా, దీపావళి సీజన్‌లో లక్షల కోట్ల అమ్మకాలతో (festive season 2023 sales in India) పండగ చేసుకున్న వ్యాపార వర్గాలు, మరో సందడిని క్యాష్‌ చేసుకునేందుకు ఇప్పటికే రెడీ అయ్యాయి. పండుగల సీజన్‌ తర్వాత, ఇప్పుడు మన దేశంలో పెళ్లిళ్ల సీజన్‌ (Wedding season 2023 in India) స్టార్ట్‌ అయింది.

వివాహాన్ని వీలైనంత ఆర్భాటంగా చేసి తమ దర్పాన్ని, దర్జాను అందరికీ చాటాలన్న తాపత్రయం చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంటుంది. దీనికోసం డబ్బులను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తుంటారు. ఇది, వ్యాపారాలకు లాభాలను తెచ్చి పెడుతోంది.

కార్తీక మాసంలో శుభ ఘడియలు (Marriages In Karthika Masam 2023)
మన దేశంలో కార్తీక మాసంతో పాటు శుభ ఘడియలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల ముహూర్తాలు, డిసెంబర్‌ 15 వరకు (wedding season from 23 November 3023 to 15 December 2023) ఉన్నాయి. కొనసాగుతుంది. వివాహ వేడుకల డిమాండ్లను తీర్చడానికి భారతదేశ వ్యాపార సంఘం సిద్ధంగా ఉంది.

ఈ ఏడాది నవంబర్‌ 23, 24, 27, 28, 29 తేదీలు, డిసెంబర్‌లో 3, 4, 7, 8, 9, 15 తేదీలు శుభప్రదంగా ఉన్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, నవంబర్‌ 23 - డిసెంబర్‌ 15 కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 38 లక్షల వివాహాలు జరగవచ్చు. 

వివాహాల ఖర్చు రూ.4.74 లక్షల కోట్లు (Rs 4.74 lakh crores Business for Weddings)
పెళ్లి అంటే చిన్న విషయమేం కాదు. వెడ్డింగ్‌ కార్డ్స్‌ అచ్చు దగ్గర నుంచి భోజనాల వరకు, అతిథులకు స్వాగతం దగ్గర నుంచి కొత్త జంటను హనీమూన్‌కు పంపడం వరకు పెద్ద తతంగమే ఉంటుంది. దీని కోసం పసుపు కొమ్ముల నుంచి పసుపు లోహం (బంగారం) వరకు, మేళగాళ్ల నుంచి మేటి వెడ్డింగ్‌ ప్లానర్స్‌ వరకు వందలాది వస్తువులు, సేవలు అవసరం అవుతాయి. ఆతిథ్యం ఇచ్చే వాళ్లే కాదు... బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా వివాహానికి వచ్చే అతిథులు ఇంధనం, ట్రాన్స్‌పోర్టేషన్‌, గిఫ్ట్స్‌, హోటల్స్‌ వంటి వాటికి కోసం ఖర్చు చేస్తారు. 

వీటన్నింటికీ కలిపి, ఈ మూడు వారాల్లోనే భారతీయులు రూ. 4.74 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని కాయిట్‌ (CAIT) అంచనా వేసింది. దీనిని మరోలా చెప్పాలంటే, కేవలం పెళ్లిళ్ల కోసమే రూ. 4.74 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరగబోతోంది. 

గత ఏడాది ఇదే కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 32 లక్షల వివాహాలు జరగ్గా, అప్పుడు మొత్తం రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం నమోదైంది. దీనితో పోలిస్తే, ఈ ఏడాది మరో రూ.లక్ష కోట్ల వ్యాపారం పెరగబోతోంది.

ఈ వెడ్డింగ్‌ సీజన్‌లో, ఒక్క దిల్లీలోనే 4 లక్షలకు పైగా వివాహాలు జరగవచ్చని కాయిట్‌ అంచనా వేసింది. పెళ్లిళ్ల కోసం హస్తినలో దాదాపు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని చెబుతోంది.

CAIT అంచనా ప్రకారం... దాదాపు రూ.3 లక్షల ఖర్చుతో దాదాపు 7 లక్షల వివాహాలు, రూ.6 లక్షల వ్యయంతో 8 లక్షల పెళ్లిళ్లు, రూ.10 లక్షలతో 10 లక్షల వెడ్డింగ్స్‌, రూ.15 లక్షలతో 7 లక్షల మ్యారేజెస్‌, రూ.25 లక్షలతో 5 లక్షల వివాహాలు, రూ.50 లక్షలతో 50 వేల పెళ్లిళ్లు, రూ.కోటికి పైగా వ్యయంతో మరో 50 వేల పెళ్లిళ్లు జరగొచ్చు.

నవంబర్‌ 23 - డిసెంబర్‌ 15 ఘడియల తర్వాత, 2024 జనవరి - జులై కాలంలోని వివిధ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. 

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Embed widget