KTR Wishes KCR: నా ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి మా నాన్న హీరో: కేసీఆర్‌కు కేటీఆర్ విషెష్
Happy Birthday To KCR | ఉద్యమనేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తనయుడు కేటీఆర్ విషెస్ తెలిపారు. రాష్ట్రం మొత్తానికి మా నాన్న హీరో అని పోస్ట్ చేశారు.

KCR Birthday Celebrations| హైదరాబాద్: నేడు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పుట్టినరోజు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు మాజీ సీఎం పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మై డాడ్ మై ఫస్ట్ హీరో, ఎంతో మందికి హరో అంటూ కేటీఆర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
‘తమ పిల్లలకు ఫస్ట్ హీరో తమ తండ్రి అని అంటారు. కానీ మా నాన్న నాకు ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి హీరో కావడం నా అదృష్టం. కేవలం కల కనడం మాత్రమే కాదు, దానిని సాకారం చేసుకునేందుకు హద్దులులేని నిబద్ధతతో బయలుదేరారు. విమర్శలను ఎదుర్కోవడంతో పాటు వారికి తన కల ఎలా నెరవేరుతుందో గర్వంగా చూపించారు. తెలంగాణ అనే కల గని, దాని కోసం అంతులేని పోరాడటం చేశారు. మీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా మీ కల సాకారం చేసుకున్నారు.
They say every Father is their child’s Hero
— KTR (@KTRBRS) February 17, 2025
I am blessed that my father isn’t just mine alone but the Hero of Telangana 😊
He defines what it means;
To have a dream and to set out for it with unbridled commitment!
To fight off naysayers and show them proudly how it is done!… pic.twitter.com/bPqeb6Begz
నా ఏకైక కల ఏంటంటే.. మీరు ఎవరో అందులో నేను కనీసం ఒక భాగం కావడం. మీరు గర్వంగా నా కొడుకు అని చెప్పుకునేలా మారడమే నా ఏకైక లక్ష్యం. మీరు చూపిన మార్గంలో నడుస్తూ ప్రతిక్షణం రాష్ట్రం కోసం, మన వారసత్వం కోసం పోరాటం కొనసాగిస్తా. మీ జీవితం నాకు ప్రేరణ. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న’ అని తన తండ్రి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.
హరీష్ రావు విషెస్
కేసీఆర్ తెలంగాణ ఉద్వేగం
— Harish Rao Thanneeru (@BRSHarish) February 16, 2025
కేసీఆర్ తెలంగాణ ఉద్రేకం
కేసీఆర్ తెలంగాణ స్వాభిమానం
కేసీఆర్ జై తెలంగాణ యుద్ధ నినాదం
కేసీఆర్ తెలంగాణ సమున్నత అస్తిత్వం
కేసీఆర్ తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం
కేసీఆర్ తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం
కేసీఆర్ తెలంగాణ అనురాగాల అమృతత్వం
కేసీఆర్ తెలంగాణ ప్రజాగళం… pic.twitter.com/JznYJ8Sgq2
బిఆర్ఎస్ అధినేత జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలకు పిలుపు
భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నేడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎవరికి తోచినవిధంగా పార్టీ శ్రేణులు ఇతరులకు సహాయపడేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వీలున్న చోట రక్తదాన శిబిరాలు నిర్వహణ, పండ్ల పంపిణీ, అన్నదానం లాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

