Stocks To Watch 21 November 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Airtel, Concor, IGL, IRCTC
Stock Market News: మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 21 November 2023: ఇండియన్ ఈక్విటీ బెన్‌మార్క్ సూచీలు ఈ రోజు గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. OpenAI మాజీ CEO సామ్ ఆల్ట్‌మాన్, మైక్రోసాఫ్ట్‌లో చేరనున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించడంతో అమెరికన్ టెక్ స్టాక్స్ లాభపడ్డాయి, నాస్‌డాక్ 1 శాతానికి పైగా పెరిగి 22 నెలల గరిష్టానికి చేరింది.
వాల్ స్ట్రీట్ లాభాలకు ఆసియా మార్కెట్లు అద్దం పట్టాయి. హాంగ్ సెంగ్, కోస్పి తలో 1 శాతం పెరిగాయి.
ఈ రోజు ఉదయం 8.30 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 08 పాయింట్లు లేదా 0.05% గ్రీన్ కలర్‌లో 9,814 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
భారతి ఎయిర్‌టెల్: 2015లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు సంబంధించిన బకాయిల్లో ఎక్కువ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించడానికి, ఆఫ్‌షోర్ బాండ్లు జారీతో కలిపి 1 బిలియన్ డాలర్ల సేకరణ కోసం ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది.
ABB ఇండియా: దేశంలోని మెట్రో రోలింగ్ స్టాక్ ప్రాజెక్ట్‌లకు ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను సరఫరా చేయడానికి ABB - టిటాగర్ రైల్ సిస్టమ్స్ పార్ట్‌నర్స్‌గా మారాయి. వీటి ఒప్పందం ప్రకారం, ట్రాక్షన్ కన్వర్టర్లు, సహాయక కన్వర్టర్లు, ట్రాక్షన్ మోటార్లు, TCMS సాఫ్ట్‌వేర్ సహా ABB ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను టిటాగర్ కొనుగోలు చేస్తుంది.
IRCTC: రైళ్లలో క్యాటరింగ్ కోసం 7 సంవత్సరాల (5+2 సంవత్సరాలు) దీర్ఘకాలిక టెండర్లకు వెళ్లడానికి IRCTCని రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతించింది. తొలి 5 సంవత్సరాల్లో గుత్తేదారు పనితీరు సంతృప్తికరంగా ఉంటే, మిగిలిన రెండేళ్లు ఆ కాంట్రాక్టును IRCTC కొనసాగిస్తుంది.
కాంకర్ మరియు IGL: తన టెర్మినల్స్‌లో LNG/LCNG మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఇంద్రప్రస్థ గ్యాస్‌తో ఒప్పందం చేసుకుంది. తొలుత, కాంకర్‌కు చెందిన దాద్రీ టెర్మినల్‌లో ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు.
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా వినయ్ ఎం టోన్సేను ప్రభుత్వం నియమించింది, నవంబర్ 30, 2025 వరకు ఆయన పదవి కాలం కొనసాగుతుంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ 'ముంబై ట్రావెల్ రిటైల్', మకావు అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్యూటీ-ఫ్రీ మద్యం, పొగాకు దుకాణాల టెండర్‌పై బిడ్డింగ్ కోసం MTRPL మకావును ఏర్పాటు చేసింది.
టాటా పవర్: గత ఏడు నెలల్లో, తమ పోర్ట్‌ఫోలియోలోకి మరో 1.4 GW గ్రూప్ క్యాప్టివ్ ప్రాజెక్టులను యాడ్ చేసినట్లు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రకటించింది. వీటి జోడింపుతో, దాని మొత్తం రెన్యువబుల్ కెపాసిటీ 2023 అక్టోబర్ నాటికి 7,961 మెగావాట్లకు చేరుకుంది.
టెక్ మహీంద్ర: డిజిటల్ సేవలను అందించేందుకు, నియోమ్ టెక్‌తో టెక్ మహీంద్రా అమెరికాస్ ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా, నియోమ్ గ్రూప్ కంపెనీలకు ప్రొడక్ట్, ప్లాట్‌ఫారమ్ డెవలప్‌మెంట్ సర్వీసులను అందించడానికి కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తుంది.
వాస్కాన్ ఇంజినీర్: పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ.356.78 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను ఈ ఇంజినీరింగ్ కంపెనీ పొందింది.
ICICI లాంబార్డ్: సంజీవ్ మంత్రిని MD & CEOగా ఈ కంపెనీ నియమించింది, డిసెంబరు 1, 2023 నుంచి ఐదు సంవత్సరాల కాలం ఈ అపాయింట్‌మెంట్ ఉంటుంది.
K M షుగర్ మిల్స్: అయోధ్య ఫ్యాక్టరీలో 15 మెగావాట్ల కేబుల్ కాలిపోయింది. ఈ ఘటనలో ఒక ఇంజినీర్ మరణించడంతో ఫ్యాక్టరీ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.