అన్వేషించండి

Stocks To Watch 16 August 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' ITC, Vodafone, IndiGo

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 16 August 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 80 పాయింట్లు లేదా 0.41 శాతం రెడ్‌ కలర్‌లో 19,394 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

ITC: 2023-24 ఫైనాన్షియల్‌ ఇయర్‌ Q1లో ఐటీసీ నికర లాభం 18% వృద్ధితో రూ. 4,903 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం 8% క్షీణించి రూ. 15,828 కోట్లకు పరిమితమైంది. ఐటీసీ నికర లాభం రూ. 4,769 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్‌ అంచనా వేస్తే, అంత కంటే ఎక్కువే ఈ కంపెనీ ఆర్జించింది. అయితే, ఆదాయం మాత్రం అంచనా వేసిన రూ. 16,893 కోట్ల కంటే తక్కువగా ఉంది.

ZEE: జీ లిమిటెడ్‌ ఓనర్లు సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకాకు సంబంధించిన కేసుల్లో, మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ తన దర్యాప్తును 8 నెలల్లో పూర్తి చేస్తుంది.

వొడాఫోన్ ఐడియా: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా తన నష్టాలను రూ. 7,840 కోట్లకు పెంచుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం స్వల్పంగా 2% పెరిగి రూ. 10,655 కోట్లకు చేరుకుంది.

సెన్కో గోల్డ్: కోల్‌కతాకు చెందిన సెన్‌కో గోల్డ్, FY24 మొదటి త్రైమాసికంలో 23% వృద్ధితో రూ. 27.6 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని మిగుల్చుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 30% పెరిగి రూ. 1,305 కోట్లకు చేరుకుంది.

VIP ఇండస్ట్రీస్‌: ఈ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి అనింద్యా దత్తా తన పదవికి రాజీనామా చేశారు. ఈ రిజిగ్నేషన్‌ ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చింది.

ఇండిగో: ఏవియేషన్‌ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌లో (ఇండిగో), కో-ఫౌండర్ రాకేశ్‌ గంగ్వాల్‌ కుటుంబం మరోసారి తన స్టేక్‌ను మార్కెట్‌లో అమ్మకానికి పెడుతోంది. బ్లాక్‌ డీల్‌ ద్వారా షేర్లు అమ్మేసి, 450 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 3,735 కోట్లు) సమీకరించాలన్నది గంగ్వాల్‌ కుటుంబం ప్లాన్‌గా తెలుస్తోంది.

ఇన్ఫోసిస్: ఇన్ఫోసిస్-లిబర్టీ గ్లోబల్ కలిసి 1.64 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కమ్యూనికేషన్స్ కంపెనీకి చెందిన డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, కనెక్టివిటీ ప్లాట్‌ఫామ్స్‌ను అభివృద్ధి చేయడానికి, పరిధి పెంచడానికి ఈ ఒప్పందం కుదిరింది.

అశోక్ లేలాండ్: అశోక్ లేలాండ్ డైరెక్టర్ల బోర్డు OHM ఇంటర్నేషనల్ మొబిలిటీ నుంచి OHM గ్లోబల్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100% వాటాను నామమాత్రపు రేటు రూ.1 లక్షకు కొనడానికి ఆమోదం తెలిపింది. OHM గ్లోబల్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌ ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదు కాబట్టి, ఈ డీల్‌ నామమాత్రపు రేటుకు జరిగింది.

హీరో మోటోకార్ప్: ముంజాల్ కుటుంబం 2016లో కుదుర్చుకున్న సెటిల్‌మెంట్ ఒప్పందం ప్రకారం, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌ పదవి నుంచి సునీల్ కాంత్ ముంజాల్ వైదొలుగుతారని హీరో మోటోకార్ప్ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: మిమ్మల్ని అస్సలు టెన్షన్‌ పెట్టవీ హైబ్రిడ్‌ ఫండ్స్‌, ఇది రిస్క్‌ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్‌

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
Supreme Court: ఉపఎన్నికలకు మేం సిద్ధం - సుప్రీంకోర్టు నోటీసులతో కేటీఆర్ కీలక ప్రకటన
ఉపఎన్నికలకు మేం సిద్ధం - సుప్రీంకోర్టు నోటీసులతో కేటీఆర్ కీలక ప్రకటన
Next on Netflix: కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
Vijayawada News: అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP DesamJC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP DesamTirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP DesamPrabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Deputy Mayor Election: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు, రెండోరోజు అర్ధరాత్రి ఉద్రిక్తత- పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసం
Supreme Court: ఉపఎన్నికలకు మేం సిద్ధం - సుప్రీంకోర్టు నోటీసులతో కేటీఆర్ కీలక ప్రకటన
ఉపఎన్నికలకు మేం సిద్ధం - సుప్రీంకోర్టు నోటీసులతో కేటీఆర్ కీలక ప్రకటన
Next on Netflix: కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
Vijayawada News: అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
Manchu Fight: కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
Jagan disqualification: అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
Battula Prabhakar: రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
Most Expensive Laptops : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 ల్యాప్‌టాప్‌లు ఇవే
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 ల్యాప్‌టాప్‌లు ఇవే
Embed widget