search
×

Hybrid Mutual Fund: మిమ్మల్ని అస్సలు టెన్షన్‌ పెట్టవీ హైబ్రిడ్‌ ఫండ్స్‌, ఇది రిస్క్‌ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్‌

మార్కెట్ ర్యాలీ నుంచి లాభాలు సంపాదిస్తూనే, 'లోయర్‌ రిస్క్‌' మెయిన్‌టైన్‌ చేయాలంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌ ఉపయోగపడతాయి.

FOLLOW US: 
Share:

Hybrid Mutual Fund: రిస్క్ తీసుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు మాత్రమే స్టాక్ మార్కెట్ సూట్‌ అవుతుంది. మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేదా అనుభవం లేని పెట్టుబడిదార్లకు మ్యూచువల్ ఫండ్స్ మార్గమే ఉత్తమం. ప్రతి మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌కు ప్రత్యేకంగా ఒక ఎక్స్‌పర్ట్స్‌ టీమ్‌ ఉంటుంది, ఫండ్‌లో పెట్టుబడులను ఆ టీమ్‌ నిర్వహిస్తుంది. కాబట్టి, మీరు మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెడితే, మీ డబ్బును ఆ ఎక్స్‌పర్ట్స్‌ టీమ్‌ మేనేజ్‌ చేస్తుంది.

హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌తో ఏంటి లాభం?
మార్కెట్ ర్యాలీ నుంచి లాభాలు సంపాదిస్తూనే, 'లోయర్‌ రిస్క్‌' మెయిన్‌టైన్‌ చేయాలంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌ ఉపయోగపడతాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అంటే... విభిన్న రకాల పెట్టుబడుల మిశ్రమం. సాధారణంగా, హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇండియన్‌ ఈక్విటీస్‌, డెట్‌ (బాండ్స్‌) రెండూ ఉంటాయి. మరికొన్ని హైబ్రిడ్ ఫండ్స్‌ ఇండియన్‌ ఈక్విటీలు, డెట్‌తో పాటు బంగారంలో, ఇంటర్నేషనల్‌ ఈక్విటీ మార్కెట్లలోనూ పెట్టుబడులు పెడతాయి. అంటే, ఈ ఒక్క ఫండ్‌లో మీరు డబ్బులు పెడితే ఈక్విటీస్‌, డెట్‌, బంగారం ఇలా అన్ని రూపాల్లో పెట్టుబడి పెట్టినట్లే.

హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ ఎవరి కోసం?
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్‌లో మీరు పెట్టే పెట్టుబడి ఒకటే అయినా, విభిన్న అసెట్‌ క్లాస్‌ల ప్రయోజనాన్ని అది అందిస్తుంది. వెయ్యి రూపాయలు, రెండు వేల రూపాయలు వంటి చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడుతూ, 3-5 సంవత్సరాల స్వల్పకాలిక లక్ష్యాలు కలిగి ఉన్న పెట్టుబడిదార్లకు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌ మెరుగైన ఛాయిస్‌.

హైబ్రిడ్ ఫండ్స్‌ ప్రధానంగా ఐదు రకాలు:

కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్‌: ఈ ఫండ్స్‌ 10-15% ఈక్విటీస్‌, మిగిలిన 75-90% డెట్‌లో పెట్టుబడి పెడతాయి. వీటిలో రిస్క్ తక్కువే, కానీ రిటర్న్స్‌ కూడా తక్కువే. దీని సగటు రాబడి గత ఒక సంవత్సరంలో 9.74%, గత మూడేళ్లలో 8.72%, గత 5 సంవత్సరాల్లో 7.16%.

అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్‌: ఈ ఫండ్స్‌ కనిష్టంగా 65%, గరిష్టంగా 80% ఈక్విటీలో పెట్టుబడి పెడతాయి. మిగిలిన 20-35% బాండ్స్‌, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టబడతాయి. ఎక్కువ రిస్క్ తీసుకోగల పెట్టుబడిదార్లకు ఇది పనికొస్తుంది. దీని బెంచ్‌మార్క్ 2022లో 4.8 శాతం రిటర్న్స్‌ ఇచ్చింది.

బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ హైబ్రిడ్ ఫండ్స్: ఈ ఫండ్, తన మొత్తం పోర్ట్‌ఫోలియోను ఈక్విటీ లేదా డెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. 2020 మార్చిలో కరోనా కారణంగా మార్కెట్ పడిపోయినప్పుడు చాలా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ హైబ్రిడ్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియోలను ఈక్విటీస్‌తో నింపేశాయి. ఆ తర్వాత మార్కెట్‌ పుంజుకున్నప్పుడు ఎక్కువ లాభాలు సంపాదించాయి.

మల్టీ-అసెట్ అలొకేషన్‌ హైబ్రిడ్ ఫండ్స్: వీటిని ఎవర్ గ్రీన్ ఫండ్స్ అంటారు. 2022లో దీని బెంచ్‌మార్క్ 5.8 శాతం ఇచ్చింది. ఈ కేటగిరీ, గత ఒక సంవత్సరంలో 17.74 శాతం, మూడేళ్లలో 17.93 శాతం, ఐదేళ్లలో 10.22 శాతం లాభాలు ఆర్జించింది.

ఈక్విటీ సేవింగ్ హైబ్రిడ్ ఫండ్స్: ఈ ఫండ్స్ ఈక్విటీలో 65 శాతం వరకు, డెట్‌లో 10 శాతం వరకు పెట్టుబడి పెడతాయి. దీని సగటు రిటర్న్స్‌ గత ఒక సంవత్సరంలో 11.32 శాతం, మూడేళ్లలో 11.06 శాతం, ఐదేళ్లలో 7.51 శాతం.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 15 Aug 2023 10:23 AM (IST) Tags: Share Market mutual fund Hybrid Mutual Fund

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !

Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !

Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!

Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!

Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో

Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో

Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !

Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !