Share Market Opening: సెన్సెస్ 250 పాయింట్లు అప్, 25000 పైన నిఫ్టీ - గ్రీన్ కార్పెట్‌పై ఐటీ, బ్యాంక్ షేర్లు
Share Market Updates: గత వారంలోని భయానక అనుభవాల నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లు కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బ్యాంక్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ మార్కెట్‌లు ఈ రోజు మంచి ఆరంభాన్ని ఇచ్చాయి.
Stock Market News Updates Today 07 Oct: దేశీయ స్టాక్ మార్కెట్‌లో కదలికలు ఈ రోజు (సోమవారం, 07 అక్టోబర్ 2024) చురుగ్గా ఉన్నాయి. గత వారంలోని పతనం నుంచి బయటపడి, షేర్ మార్కెట్ ఈ రోజు మంచి ఓపెనింగ్స్ ఇచ్చింది. శుక్రవారం అమెరికన్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. ఆ ప్రభావం నేడు ఇండియన్ ఈక్విటీలపై ఉంది. నిఫ్టీ IT ఇండెక్స్ 300 పాయింట్లు ఎగువన ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగి మార్కెట్‌ను ఉత్తేజపరుస్తోంది. ప్రారంభంలో ఈ ఇండెక్స్ 250 పాయింట్లు పెరిగింది. షేర్ల అడ్వాన్స్-డిక్లైన్ రేషియో కూడా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల సూచీలు ఈ రోజు ఎద్దులపై సవారీ చేస్తున్నాయి. ఓలటాలిటీ ఇండెక్స్ VIXలో ఈ రోజు పెద్దగా కదలిక లేదు.
గత వారాంతంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొత్త దాడులు జరక్కపోవడంతో గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్ కొంతవరకు కుదుటపడింది. ఈ రోజు, ఇండియన్ ఈక్విటీలకు ఆసియా మార్కెట్ల నుంచి కూడా మద్దతు అందుతోంది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..
గత సెషన్‌లో (శుక్రవారం) 81,866 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 238.54 పాయింట్లు లేదా 0.29 శాతం పెరుగుదలతో 81,926.99 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. శుక్రవారం 25,014 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 69.50 పాయింట్లు లేదా 0.28 శాతం పెరుగుదలతో 25,084.10 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
షేర్ల పరిస్థితి
నేటి ట్రేడ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 27 షేర్లు ఉత్తర దిశగా పయనిస్తుంటే, మిగిలిన 3 షేర్లు దక్షిణ ముఖంగా వెళ్తున్నాయి. లాభపడిన షేర్లలో.. ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. నష్టపోయిన షేర్లలో... టైటన్, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్ గ్రిడ్ ఉన్నాయి.
నిఫ్టీ 50 ప్యాక్‌లో.. 43 స్టాక్స్ పెరుగుదలను, 7 స్టాక్స్ తరుగుదలను చూస్తున్నాయి. ఈ ఇండెక్స్‌లో కూడా ఐటీసీ టాప్ గెయినర్‌గా కొనసాగుతుండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు పుంజుకుంటున్నాయి. టైటన్, అదానీ పోర్ట్స్ షేర్లు బలహీనంగా కదులుతున్నాయి.
రంగాల వారీగా...
ఐటీ ఇండెక్స్ 0.98 శాతం పెరిగింది. బ్యాంక్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా మంచి పొజిషన్‌లో ఉన్నాయి. మిగతా అన్ని రంగాల సూచీలు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
బ్రాడర్ మార్కెట్లలో.. BSE 100 మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.42 శాతం, BSE 100 స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం పెరిగాయి.
ఉదయం 10.25 గంటలకు, సెన్సెక్స్ 233.83 పాయింట్లు లేదా 0.29% పెరిగి 81,922.28 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి నిఫ్టీ 19.85 పాయింట్లు లేదా 0.07% పెరిగి 25,034.45 దగ్గర ట్రేడవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఐటీసీ షేర్‌హోల్డర్లకు లడ్డూ లాంటి వార్త - డీమెర్జర్‌లో కీలక ఘట్టం పూర్తి