అన్వేషించండి

ITC: ఐటీసీ షేర్‌హోల్డర్లకు లడ్డూ లాంటి వార్త - డీమెర్జర్‌లో కీలక ఘట్టం పూర్తి

ITC Hotels: ఐటీసీ లిమిటెడ్‌లో హోటళ్ల వ్యాపారం కూడా కలిసి ఉంది. మౌర్య షెరటాన్ పేరుతో ఈ కంపెనీ హోటల్ బిజినెస్‌ చేస్తోంది. ఈ విభజన వల్ల ఐటీసీ షేర్ హోల్డర్లకు వాల్యూ అన్‌లాక్‌ అవుతుంది.

NCLT Approval: ఐటీసీ షేర్‌హోల్డర్లకు పండుగ టైమ్‌లో పసందైన వార్త. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న శుభ ముహూర్తానికి మరో ముందడుగు పడింది. ఐటీసీ నుంచి హోటల్ వ్యాపారాన్ని విడదీసి, స్వతంత్ర్య కంపెనీగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ చేయడానికి మార్గం సుగమమైంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT), ఐటీసీ లిమిటెడ్‌కు చెందిన హోటల్ వ్యాపార విభజనను (Demerger Of ITC Hotels) ఆమోదించింది. ఐటీసీ, మౌర్య షెరటాన్ పేరుతో హోటల్ వ్యాపారం (ITC Hotel Business) నిర్వహిస్తోంది.

వాస్తవానికి, హోటల్ వ్యాపారాన్ని కంపెనీ నుంచి వేరు చేస్తున్నట్లు గత ఏడాది ఆగస్టులోనే ITC ప్రకటించింది. ఐటీసీలో కలిసి ఉండడం వల్ల హోటల్‌ వ్యాపారం విలువ మరుగునపడుతోంది. ఈ విలువను అన్‌లాక్‌ చేయడానికి డీమెర్జర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఐటీసీ హోటల్స్‌ డీమెర్జర్‌ కోసం షేర్‌హోల్డర్లు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. హోటల్‌ బిజినెస్ డీమెర్జర్‌ వల్ల వాల్యూ అన్‌లాక్‌ అవుతుందని, తమకు కొత్త కంపెనీ (హోటల్‌ బిజినెస్‌) నుంచి కూడా షేర్లు వస్తాయని చాలాకాలంగా ఆశపడుతున్నారు. 

హోటల్‌ వ్యాపారం విభజన తర్వాత, ITC వాటాదార్లకు హోటల్ వ్యాపార కంపెనీ నుంచి షేర్లను కేటాయిస్తారు. ఈ స్వతంత్ర సంస్థ వ్యాపారాభివృద్ధి కోసం నిర్ణయాలను మరింత వేగంగా తీసుకోగలుగుతుంది. గత కొన్నేళ్లుగా తమ హోటల్ వ్యాపారం మరింత బలపడిందని ఐటీసీ చాలాసార్లు వెల్లడించింది. ఇప్పుడు అది తనంతట తానుగా పురోగమిస్తోందని తెలిపింది. 

NCLT ఆమోదం 
కోల్‌కతా బెంచ్ ఆఫ్ ఎన్‌సీఎల్‌టీ (National Company Law Tribunal), తన హోటల్ వ్యాపారాన్ని విభజించడాన్ని ఆమోదించినట్లు ఐటీసీ లిమిటెడ్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆర్డర్ కాపీని ఇచ్చిన తర్వాత డీమెర్జర్ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించింది. డీమెర్జర్‌ తేదీకి సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే రెండు స్టాక్ ఎక్స్ఛేంజీలకు (BSE, NSE) ఇస్తుంది.

వాటాదార్లకు ఫ్రీ షేర్లు
డీమెర్జర్ తర్వాత, ఈ స్కీమ్ కింద... సిగరెట్ల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల వరకు, వివిధ పని చేస్తున్న ఐటీసీ కంపెనీకి ఐటీసీ హోటల్స్‌లో 40 శాతం వాటా ఉంటుంది. ఐటీసీ హోటల్స్‌లో మిగిలిన 60 శాతం వాటాను ఐటీసీ వాటాదార్లకు కేటాయిస్తారు. ప్రస్తుత షేర్ హోల్డింగ్‌ను బట్టి షేర్ల కేటాయింపు నిష్పత్తిని నిర్ణయిస్తారు. ఈ విధంగా, ITC వాటాదార్లకు ITC హోటల్స్‌లో కూడా ఫ్రీ షేర్లు వస్తాయి.

ఇప్పటికే CCI ఆమోదం
ITC వాటాదార్లు ఈ ఏడాది జూన్‌లో ఈ విభజనను ఆమోదించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం సహా అన్ని వర్గాల వాటాదార్లు, రుణదాతలు మెజారిటీ ఓట్లతో ఆమోదించారు. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ ఈ విభజన ప్రతిపాదనను వ్యతిరేకించడంతో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ITC ప్రతిపాదనకు, ఇప్పటికే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి కూడా ఆమోదం లభించింది. 

శుక్రవారం, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ఐటీసీ షేర్లు దాదాపు 2 శాతం నష్టాల్లో ముగిశాయి. ప్రస్తుతం, ఒక్కో షేర్‌ రూ.500 పైన ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడు జుకర్‌బర్గ్ - బెజోస్‌ను దాటి ముందడుగు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Hemant Soren: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
Embed widget