Share Market Closing Today: ఆల్-టైమ్ హైని తాకగానే ప్రాఫిట్ బుకింగ్స్ - మార్కెట్ మూడ్ పాడు చేసిన మిడ్, స్మాల్ క్యాప్స్
Share Market Updates Today: ఈ రోజు మార్కెట్ పెరిగినప్పటికీ, బీఎస్ఈలో లిస్టయిన స్టాక్స్ మార్కెట్ విలువ రూ.1.63 లక్షల కోట్ల నష్టంతో రూ.466.09 లక్షల కోట్ల వద్ద ముగిసింది.
Stock Market Closing On 19 September 2024: మన మార్కెట్లు ఈ రోజు (గురువారం, 19 సెప్టెంబర్ 2024) అద్భుతంగా విజృంభించాయి, ఆ వెంటనే జావగారిపోయాయి. మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి (Stock markets at record levels) చేరాయి. అయితే, ఐటీ స్టాక్స్, మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ ఎగువ స్థాయి నుంచి పడిపోయింది.
ఇంట్రా-డే ట్రేడింగ్‌లో BSE సెన్సెక్స్ తాజా గరిష్ట స్థాయి 83,773.61 ని (Sensex at fresh all-time high) క్రియేట్ చేసింది. NSE నిఫ్టీ కూడా 25,611.95 (Nifty at fresh all-time high) వద్ద గరిష్ట స్థాయిని టచ్ చేసింది.
ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 236.57 పాయింట్లు లేదా 0.29% పెరిగి 83,184.80 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 38.25 పాయింట్లు లేదా 0.15% లాభంతో 25,415.80 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 83,359.17 వద్ద, నిఫ్టీ 25,487.05 వద్ద ఓపెన్ అయ్యాయి.
పెరిగిన & పడిపోయిన షేర్లు
BSE సెన్సెక్స్ 30 ప్యాక్‌లో.. 19 షేర్లు లాభాలతో, 11 నష్టాలతో స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లో 27 షేర్లు లాభాల్లో, 23 నష్టాలతో ట్రేడ్‌ను ముగించాయి. టాప్ గెయినర్స్‌లో... ఎన్‌టీపీసీ 2.45 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.82 శాతం, టైటన్ 1.56 శాతం, నెస్లే 1.51 శాతం, హెచ్‌యుఎల్ 1.21 శాతం, మారుతీ సుజుకీ 0.99 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.81 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.81 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.75 శాతం చొప్పున పెరిగాయి. టాప్ లూజర్స్‌లో... అదానీ పోర్ట్స్ 1.30 శాతం, ఎల్ అండ్ టీ 1.26 శాతం, టీసీఎస్ 1.14 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 0.91 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.86 శాతం, టాటా స్టీల్ 0.66 శాతం, టెక్ మహీంద్రా 0.64 శాతం పతనమయ్యాయి.
BSEలో మొత్తం 4,075 షేర్లు ట్రేడ్ అవగా, వాటిలో.. 1,249 స్టాక్స్ లాభాలతో, 2,732 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. అంటే, పెరుగుతున్న స్టాక్‌ల కంటే రెండింతలు స్టాక్‌లు ముగిశాయి
సెక్టార్ల వారీగా చూస్తే..
నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, రియల్ ఎస్టేట్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్లు గ్రీన్ జోన్‌లో సెటిల్ అయ్యాయి. ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, మీడియా రంగాల షేర్లు రెడ్ జోన్‌లో ఎండ్ అయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి 1850 పాయింట్లు పతనం కాగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 680 పాయింట్లు పడిపోయింది. అయితే, రెండు ఇండెక్స్‌లు దిగువ స్థాయిల నుంచి కోలుకున్నాయి. ట్రేడ్ ముగిసేసరికి, మిడ్ క్యాప్ ఇండెక్స్ 400 పాయింట్లు, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 245 పాయింట్ల మేర నష్టపోయాయి.
తగ్గిన మార్కెట్ క్యాప్
స్టాక్ మార్కెట్ పచ్చగా ముగిసి ఉండొచ్చుగానీ, మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ స్టాక్స్ పతనం కారణంగా ఇన్వెస్టర్లు భారీ నష్టాలను భరించాల్సి వచ్చింది. బీఎస్‌ఇలో లిస్టయిన స్టాక్స్ మార్కెట్ క్యాప్ (market capitalization of indian stock market) ఈ రోజు రూ. 466.09 లక్షల కోట్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో ఇది రూ.467.72 లక్షల కోట్ల వద్ద ఉంది. అంటే, నేటి సెషన్‌లో ఇన్వెస్టర్లు రూ. 1.63 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మరో పదేళ్లలో రిటైర్ అవుతున్నారా?, నెలకు రూ.23,000 ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?