By: Arun Kumar Veera | Updated at : 19 Sep 2024 02:59 PM (IST)
నెలకు రూ.23,000 ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ( Image Source : Other )
Monthly Income: మీరు మరో 10 సంవత్సరాల్లో రిటైల్ అవుతున్నారా?. పదవీ విరమణ తర్వాత మీ జీవితం సాఫీగా సాగేందుకు ఎంత డబ్బు కావాలో లెక్కగట్టారా? మీకు ఎంత డబ్బు అవసరం అన్నది మీ లైఫ్‌స్టైప్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ధరలు పదేళ్ల తర్వాత ఉండవు. కాబట్టి, ఇక్కడ ఒక థంబ్ రూల్ గుర్తు పెట్టుకోవాలి. ప్రస్తుత ఖర్చుల కంటే దాదాపు 25-30 రెట్లు ఎక్కువ డబ్బు అప్పటికి అవసరం కావచ్చు.
పదవీ విరమణ తర్వాతి జీవితం చాలా ముఖ్యమైనది. చివరివరకు మీ నెలవారీ ఆదాయానికి ఢోకా ఉండకూడదు. త్వరగా రిటైర్మెంట్ తీసుకున్నవాళ్లకు మరింత ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది. ఉదాహరణకు, ప్రస్తుతం 50 ఏళ్ల వ్యక్తి మరో పదేళ్లలో, అంటే, 60 ఏళ్ల వయస్సులో రిటైర్ అయితే, రిటైర్మెంట్ తర్వాత కనీసం 20 సంవత్సరాలు అతని కుటుంబం ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా గడవాలి. అంటే రిటైర్మెంట్ తర్వాత కనీసం 20 ఏళ్లకు సరిపోయే డబ్బు అతని దగ్గర ఉండాలి.
మరో ఉదాహరణ చూద్దాం. ప్రస్తుతం 45 సంవత్సరాల వయస్సులో ఉన్న వ్యక్తి 55 సంవత్సరాల వయస్సులోనే పదవీ విరమణ చేశాడనుకుందాం. అతను కనీసం 25 సంవత్సరాల పోస్ట్ రిటైర్మెంట్ జీవితాన్ని చూస్తాడు, దానికి సరిపడా ఫండ్‌ను అప్పటికి పోగేసుకోవాలి. ఇప్పుడు 35 సంవత్సరాల వయస్సులో ఉన్న వ్యక్తి కనీసం మరో 35 సంవత్సరాల కోసం సిద్ధం కావాలి.
నెలకు 50,000 రూపాయలు
ఇప్పుడు 40 ఏళ్ల వ్యక్తి తన 50వ ఏట రిటైర్ అయితే, ఆ తర్వాత నుంచి అతను నెలకు 50,000 రూపాయలు చొప్పున మరో 30 సంవత్సరాల వరకు (అతనికి 80 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు) తీసుకోవాలంటే ఏం చేయాలి?. రిటైర్ అయ్యేనాటికి అతని దగ్గర రూ. 1.64 కోట్ల ఫండ్ ఉండాలి. ఆ డబ్బును 6% వార్షిక రాబడి వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.50,000 చేతికి వస్తుంది. 12% రిటర్న్ ఇవ్వగల మార్గంలో ఇన్వెస్ట్ చేయాలంటే, రిటైర్ అయ్యేనాటికి అతని దగ్గర రూ.73.61 లక్షలు ఉంటే చాలు.
రిటైర్మెంట్ కార్పస్‌ను మ్యూచువల్ ఫండ్‌లోని సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్‌లో (SWP)లో పెట్టుబడి పెడితే, నెలకు రూ.50,000 తీసుకోవచ్చు. ఇది సంవత్సరానికి 4% పెరుగుతుంది. మీరు రిటైర్ అయ్యేనాటికి రూ. 73.61 లక్షలు మీ దగ్గర ఉండాలంటే, మంత్లీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో (SIP) నెలకు రూ.22,600 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. వచ్చే 10 సంవత్సరాల వరకు ఈ మొత్తాన్ని ఏటా 10% చొప్పు (స్టెప్-అప్ SIP) పెంచాల్సి ఉంటుంది.
నెలకు 75,000 రూపాయలు
ఒకవేళ, రిటైర్మెంట్ తర్వాత మీకు రూ. 75,000 నెలవారీ ఆదాయం కావాలంటే, SIP మొత్తాన్ని 1.5 రెట్లు పెంచాలి. సిప్‌లో 10% వార్షిక రాబడి వస్తూ ఉండాలి. ఈ కేస్‌లో, నెలకు స్థిరంగా రూ. 67,800ను పదేళ్ల పాటు కట్టొచ్చు, లేదా, రూ.45,900తో స్టార్ చేసి, ఏడాదికి 10% స్టెప్-అప్ SIP చేయాలి.
నెలకు లక్ష రూపాయలు
అదే విధంగా, నెలకు రూ.లక్ష రూపాయలు తీసుకోవాలంటే, 12% రాబడిని ఇచ్చేలా, పదేళ్ల పాటు SIPలో స్థిరంగా రూ. 65,800 పెట్టుబడి పెట్టొచ్చు. లేదా, 10% స్టెప్-అప్ SIPలో రూ. 45,200తో ఇన్వెస్ట్ స్టార్ట్ చేయాలి.
మరో ఆసక్తికర కథనం: మూడో రోజూ పసిడి పతనం, భారీగా తగ్గుదల - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Prices Today 07 Nov: పసిడి విలవిల, అతి భారీ పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Gold-Silver Prices Today 06 Nov: పసిడిపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Investment Idea: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి - రిస్క్ లేని స్కీమ్స్ ఇవి
Best Picnic Insurance Policy: పిక్నిక్ ప్లాన్ చేసే ముందు ఇన్సూరెన్స్ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్