Paytm FASTag: పేటీఎం ఫాస్టాగ్‌ను ఎలా క్లోజ్ చేయాలి, వేరే బ్యాంకు మారడం ఎలా?
మీ పేటీఎం ఫాస్టాగ్‌ను క్లోజ్ చేసిన వెంటనే మరొక బ్యాంక్ ఫాస్టాగ్ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
Steps to close Paytm FASTag: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇచ్చిన గడువు ఈ నెల 15తో ముగిసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) జారీ చేసిన ఫాస్టాగ్‌ను మీరు ఉపయోగిస్తుంటే, అందులో బ్యాలెన్స్ యాడ్ చేసే డెడ్ లైన్ క్లోజ్ అయింది. ఒకవేళ ఆ ఫాస్టాగ్‌లో ఇప్పటికే బ్యాలెన్స్ లేకపోతే దానిని క్లోజ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్‌ను క్లోజ్ చేయడం ఎలా? (How to close Paytm Payments Bank FASTag?)
- మీ మొబైల్‌లోని పేటీఎం యాప్‌ను ఓపెన్ చేయండి
- సెర్చ్ మెనులో "Manage FASTag" కనిపిస్తుంది
- "Manage FASTag" కింద, మీ ఫాస్టాగ్‌కు లింక్ అయిన అన్ని వాహనాలను చెక్ చేయండి
- పేజీ కుడి వైపు ఎగువన "Close FASTag" బటన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి
- ఫాస్టాగ్‌ను క్లోజ్ చేయాలనుకుంటున్న వాహనాన్ని ఇప్పుడు ఎంచుకోవాలి
- "Proceed" బటన్‌పై క్లిక్ చేయండి. మొబైల్ స్క్రీన్ మీద కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపించే వరకు వెయిట్ చేయండి
- ఆ ఫాస్టాగ్ 5 నుంచి 7 పని దినాల్లో క్లోజ్ అవుతుంది
పేటీఎం ఫాస్టాగ్‌ను క్లోజ్ చేసి మరొక బ్యాంక్‌కు మారడం ఎలా?
మీ పేటీఎం ఫాస్టాగ్‌ను క్లోజ్ చేసిన వెంటనే మరొక బ్యాంక్ ఫాస్టాగ్ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఫాస్టాగ్ 7 పని దినాల్లో మీ చిరునామాకు వస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం మీకు ఇబ్బందిగా ఉంటే టోల్ ప్లాజా దగ్గరకు వెళ్లొచ్చు. అన్ని టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్‌ను విక్రయించే వ్యక్తులు కనిపిస్తారు. కొత్త ఫాస్టాగ్‌ను వెంటనే యాక్టివేట్ కూడా చేస్తారు.
పేటీఎం ఫాస్టాగ్‌లో ఇప్పటికీ బ్యాలెన్స్ ఉంటే ఏం చేయాలి, దానిని వాడుకోవచ్చా? అంటూ భారీ సంఖ్యలో యూజర్లు పేటీఎంను సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వినియోగదార్లలో ప్రశ్నలకు సమాధానంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త FAQs (Frequently Asked Questions) విడుదల చేసింది.
ప్రశ్న: పేటీఎం ఫాస్టాగ్ క్లోజ్ చేస్తే, సెక్యూరిటీ డిపాజిట్ పరిస్థితి ఏంటి?
సమాధానం: మీ PPBL ఫాస్టాగ్ క్లోజ్ అయిన మరుక్షణం, మీ సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు మిగిలిన మినిమమ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా మీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌కు క్రెడిట్ అవుతుంది.
ప్రశ్న: మార్చి 15 తర్వాత కూడా పేటీఎం ఫాస్టాగ్‌ను ఉపయోగించొచ్చా?
సమాధానం: మీ వాలెట్‌లో బ్యాలెన్స్ ఉన్నంతవరకు, మార్చి 15 తర్వాత కూడా పేటీఎం ఫాస్టాగ్‌ను ఉపయోగించొచ్చు. టోల్స్ & పార్కింగ్ ఫెసిలిటీలు చెల్లించడానికి చెల్లించడానికి ఆ ఫాస్టాగ్‌ను ఉపయోగించొచ్చు.
ప్రశ్న: నా ఫాస్టాగ్‌ను ఎలా టాప్ అప్ చేయాలి?
సమాధానం: ఇప్పుడు మీరు పేటీఎం వాలెట్‌లోకి ఫండ్స్ యాడ్ చేయలేరు, టాప్-అప్ చేయలేరు. అంటే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌ను టాప్ అప్ చేయలేరు. హైవేల మీద సాఫీగా ప్రయాణం సాగించడానికి కస్టమర్లు వేరే బ్యాంక్ నుంచి కొత్త ఫాస్టాగ్ పొందాలి.
ప్రశ్న: నా పేటీఎం ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ను కొత్త ఫాస్టాగ్‌లోకి బదిలీ చేయవచ్చా?
సమాధానం: లేదు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌లోని బ్యాలెన్స్‌ను మరొక బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌కు బదిలీ చేయడం కుదరదు.
మరో ఆసక్తికర కథనం: బ్యాంకుల్లో 5 రోజుల పని విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన