అన్వేషించండి

5-Days Work: బ్యాంకుల్లో 5 రోజుల పని విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

బ్యాంకు ఉద్యోగుల పని- వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం గురించి, వారంలో 5 రోజులు పని చేయడం గురించి, బ్యాంకుల్లో కొనసాగుతున్న చర్చల గురించి విలేకర్లు ప్రశ్నలు అడిగారు.

Nirmala Sitharaman On 5-Day Work Week For Banks: సోమవారం నుంచి శుక్రవారం వరకు పని, శని & ఆదివారాలు సెలవులు.. వెరసి, వారంలో ఐదు రోజులు పని. బ్యాంక్‌ ఉద్యోగుల సుదీర్ఘకాల డిమాండ్‌ ఇది.

17% జీతం పెంపును ఇటీవలే సాధించిన బ్యాంక్‌ ఉద్యోగులు, వారంలో ఐదు రోజుల పనికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని ఆశిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, బ్యాంకు అసోసియేషన్‌ - బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మధ్య వివిధ అంశాలపై ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో, దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందే, బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలకు గ్రీన్ సిగ్నల్‌ లభిస్తుందన్న ఆశలు పెరిగాయి. అయితే, లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగులకు ఈ విషయంలో నిరాశ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. '5-డే వీక్లీ' కోసం మరికొంత కాలం వేచి ఎదురు చూడాల్సి ఉంటుంది. 

కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, బ్యాంకుల్లో 5 రోజుల పని దినాలకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల 14న, ఐఐటీ గౌహతిలో జరిగిన వికాస్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్‌లో ఆర్థిక మంత్రి మాట్లాడారు. ఆ సమయంలో, బ్యాంకు ఉద్యోగుల పని- వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం గురించి, వారంలో 5 రోజులు పని చేయడం గురించి, బ్యాంకుల్లో కొనసాగుతున్న చర్చల గురించి విలేకర్లు ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి, వదంతులు పట్టించుకోవద్దని సూటిగా చెప్పారు.

దీనికిముందు, మార్చి 8న, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) - వివిధ బ్యాంకుల ఉద్యోగుల సంఘాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెంచేందుకు రెండు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, వివిధ ప్రభుత్వ బ్యాంక్‌ల ఉద్యోగుల జీతం 17 శాతం పెరుగుతుంది. జీతంతో పాటు, డియర్‌నెస్ అలవెన్స్ పెంపు, మరికొన్ని ప్రయోజనాలపైనా చర్చ జరిగింది.

బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘకాల డిమాండ్‌పై మాత్రం ఆ చర్చల్లో స్పష్టత రాలేదు. ప్రస్తుతం, బ్యాంకు ఉద్యోగులకు ప్రతి ఆదివారం సెలవు లభిస్తోంది. నెలలో మొదటి & మూడో, ఐదో శనివారం బ్యాంకులు తెరిచి ఉంటాయి, రెండు & నాలుగో శనివారం రోజుల్లో సెలవులు వస్తున్నాయి.

ప్రతి నెలా రెండు &నాలుగో శనివారాల్లో సెలవులు ఇస్తున్న విధంగానే మొదటి, మూడు, ఐదో శనివారాల్లోనూ సెలవులు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు గట్టిగానే అడుగుతున్నారు. బ్యాంక్ యూనియన్లు - అసోసియేషన్ మధ్య ఒప్పందం తర్వాత.. దానికి ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పెంపారు. ఈ ఫైల్‌ అక్కడ పెండింగ్‌లో ఉందని సమాచారం. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి వస్తుందని భావించారు. అయితే ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. ఇప్పట్లో అలాంటి నిర్ణయం వెలువడదని ఆర్థిక మంత్రి స్పష్టమైన సూచన చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే దేశంలో ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత, ఉద్యోగుల సెలవులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిని బట్టి, బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం అమలవుతుందా, లేదా అనేది కొత్త ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టంగా అర్ధమవుతోంది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

టాప్ హెడ్ లైన్స్

ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget