Tata Beats Maruti: 40 ఏళ్ల చరిత్రలో మొదటిసారి - మారుతి బ్రాండ్‌కు దెబ్బ కొట్టిన టాటా కారు!
Tata Punch: 40 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి మారుతి బ్రాండ్ల కార్లను కాదని టాటా పంచ్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.
Tata Motors Beats Maruti Suzuki: టాటా మోటార్స్, మారుతి సుజుకి రెండూ భారతీయ ఆటో పరిశ్రమలో అగ్ర బ్రాండ్లలో ఉన్నాయి. ఈ ఆటోమేకర్ల కార్లు దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొన్నేళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రతి సంవత్సరం కార్ల విక్రయాల నివేదికలో మారుతి కారు బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మొదటి స్థానంలో ఉండేది. అయితే ఈసారి మారుతి సుజుకి కారును టాటా మోటార్స్ ఎస్‌యూవీ అధిగమించింది. ఆటోకార్ ప్రో నివేదిక ప్రకారం టాటా పంచ్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ అవతరించింది. విక్రయాల్లో మారుతి వ్యాగన్ఆర్‌ను కూడా అధిగమించింది.
మారుతి వ్యాగన్ఆర్‌ను దాటేసిన టాటా పంచ్
టాటా మోటార్స్ కారు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా నిలవడం నాలుగు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. 2024 సంవత్సరంలో టాటా పంచ్ 2.02 లక్షల యూనిట్లు అమ్ముడుపోయింది. అదే సమయంలో గత సంవత్సరం 1.91 లక్షల యూనిట్ల మారుతి వ్యాగన్ఆర్ అమ్ముడయ్యాయి. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా పంచ్ విక్రయాల పరంగా మారుతి వ్యాగన్ఆర్, స్విఫ్ట్ రెండింటినీ వెనుకకు నెట్టేసింది. చూస్తుంటే ఇండియన్ ఆటో మార్కెట్‌లో ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 వాహనాల్లో మూడు ఎస్‌యూవీలు ఉన్నాయి. కాబట్టి ఇకపై మనదేశంలో ఎస్‌యూవీల లాంచ్‌లు ఎక్కువ అవుతాయని అనుకోవచ్చు.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
ప్రజల మొదటి ఎంపిక ఏమిటి?
టాటా పంచ్ కంటే ముందు 2023లో మారుతి ఎర్టిగా అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ అయింది. నివేదికల ప్రకారం ఈ ఎస్‌యూవీ ఈసారి అమ్మకాల నివేదికలో నాలుగో స్థానంలో నిలిచింది. నేటి కాలంలో ప్రజలు ప్రీమియం వాహనాలు, ఎస్‌యూవీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
2024లో 40 లక్షలకు పైగా వాహనాల సేల్...
భారత ఆటో పరిశ్రమ గత ఏడాది రికార్డు స్థాయి విక్రయాలను సాధించింది. 2024 సంవత్సరంలో మొత్తం 42.86 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. అదే సమయంలో ఈ వాహనాల విక్రయంలో 2018 సంవత్సరంలో 52 శాతంగా ఉన్న మారుతి సుజుకి మార్కెట్ వాటా 2024 నాటికి 41 శాతానికి పడిపోయింది. ఎస్‌యూవీలకు డిమాండ్ పెరగడమే మారుతి మార్కెట్ వాటా తగ్గడంలో కీలకపాత్ర పోషించాయి. అంతే కాకుండా ఈ బ్రాండ్ మోడల్ ర్యాంకింగ్‌ను కూడా ప్రభావితం చేసింది. అయినప్పటికీ మారుతి వాహనాలు ఇప్పటికీ మార్కెట్లో అత్యధిక మైలేజీని ఇస్తాయి.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Tata Punch was India’s highest selling car in 2024. Previously, Maruti Suzuki held that position for 40 years!
— Parth Gohil (@Parth_Go) January 5, 2025
How many Punch owners here? What was the deciding factor for you to plonk your money on this car and how has your experience been? pic.twitter.com/hNeInZIO48