![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ugadi panchangam 2024 to 2025: ఈ ఏడాది ఈ నటులకు అవార్డుల వర్షమే - ఉగాది పంచాంగం 2024 to 2025!
Ugadi panchangam in telugu 2024 to 2025 : ఈ రాశులకు చెందిన నటులు, కళాకారులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం బాగా కలిసొస్తుంది...ఆదాయం పెరుగుతుంది...
![Ugadi panchangam 2024 to 2025: ఈ ఏడాది ఈ నటులకు అవార్డుల వర్షమే - ఉగాది పంచాంగం 2024 to 2025! Ugadi panchangam in telugu 2024 to 2025 Sri Krodhi nama samvatsaram good time for these zodiac sign actors Ugadi panchangam 2024 to 2025: ఈ ఏడాది ఈ నటులకు అవార్డుల వర్షమే - ఉగాది పంచాంగం 2024 to 2025!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/10997667f102ec01af57e34b9aa4846c1712380979008217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ugadi panchangam in telugu 2024 to 2025
మేష రాశి కళాకారులు
మేష రాశి కళాకారులకు ఈ ఏడాది గురుబలం వల్ల మంచి ప్రేక్షకాదరణ పొందుతారు. సినిమా, టీవీ రంగాల్లో ఉండేవారు మంచి అవకాశాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. అవార్డులు , రివార్డులు అందుకుంటారు.
వృషభ రాశి కళాకారులు
ఈ ఏడాది వృషభ రాశి కళాకారులకు సాధారణ ఫలితాలున్నాయి. కష్టపడినా ఫలితం రావడం కష్టమే. అవార్డులు , రివార్డులు ఆశించినా ఫలితం శూన్యం. టీవీ, సినిమా రంగాల్లో ఉండే కళాకారులకు సరైన అవకాశాలు రాకపోవచ్చు.
మిథున రాశి కళాకారులు
మిథున రాశి కళాకారులకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఇబ్బందులు తప్పవు. అవకాశాలు వచ్చినట్టే వచ్చి మిస్సవుతాయి. అయినప్పటికీ ఆదాయం బాగానే ఉంటుంది.
కర్కాటక రాశి కళాకారులు
కర్కాటక రాశి కళాకారులకు కూడా గురుబలం బావుంది..ఫలితంగా మంచి అవకాశాలు పలకరిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రేక్షకాదరణ పొందుతారు. అవార్డులు రివార్డులు వరిస్తాయి...
సింహ రాశి కళాకారులు
సింహ రాశి కళాకారులకు క్రోధి నామ సంవత్సరం అంత మంచి ఫలితాలను ఇవ్వడం లేదు. పాత అవకాశాలు అలా కొనసాగుతాయి కానీ నూతన అవకాశాలు లభించడం కష్టమే. ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతాయి. అవార్డుల కోసం అస్సలే ఆలోచించవద్దు.
కన్యా రాశి కళాకారులు
శ్రీ క్రోధి నామ సంవత్సరం కన్యా రాశి కళాకారులకు గురుబలం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆదాయం ఉండదు. అవకాశాలు వస్తాయి... కెరీర్ అలా అలా సాగిపోతుంది. అంటే సమస్యలు ఉండవు, అద్భుతంగా ఉండదు..జస్ట్ ఓకే...
తులా రాశి కళాకారులకు
తులా రాశి కళాకారులకు గురుబలం లేకపోవడంతో సాధారణంగా ఉంటుంది. వెండితెర, బుల్లితెర నటులకు అవకాశాలు వస్తాయి..అయితే భారీ సంపాదన లేకపోయినా ఆదాయానికి లోటుండదు..
Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులకు విజయం - ఆ రాశి వారికి వెన్నుపోటు!
వృశ్చిక రాశి కళాకారులకు
శ్రీ క్రోధి నామ సంవత్సరం వృశ్చిక రాశి కళాకారులకు కలిసొచ్చే కాలమే. టీవీ , సినిమా రంగంలో ఉండేవారు మంచి అవకాశాలు, అవార్డులు పొందుతారు. ఈ ఏడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు కానీ ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది.
ధనస్సు రాశి కళాకారులు
ధనస్సు రాశి కళాకారులకు ఈ ఉగాది నుంచి అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేకపోయినా అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.
మకర రాశి కళాకారులకు
ఈ రాశి కళాకారులకు ఈ ఏడాది శుభసమయం. గతేడాది కన్నా మెరుగైనా ఆఫర్లు అందుకుంటారు. ఆర్థికంగా అడుగు ముందుకేస్తారు. ప్రభుత్వ సంస్థల నుంచి అవార్డులు పొందుతారు.
కుంభ రాశి కళాకారులకు
కుంభ రాశి కళాకారులకు ఈ ఏడాది కాస్త కష్టకాలమే. కొత్త అవకాశాలమా దేవుడెరుగు ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబెట్టుకోవాలి. అత్యద్భుతంగా ఉంటుందని ఆశించవద్దు, బాగోదేమో అని భయం వద్దు..రోజులు అలా గడిచిపోతాయి. ఓర్పు ,నేర్పు చాలా అవసరం.
మీన రాశి కళాకారులకు
శ్రీ క్రోధి నామ సంవత్సరం మీన రాశి ఆర్టిస్టులకు మంచి సమయం. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆశించిన అవకాశాలు లభిస్తాయి. కెరీర్లో స్థిరత్వం వస్తుంది. అవార్డులు పొందుతారు.
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)