January 9 to 15 Weekly Horoscope 2023: భూమి, ఇల్లు, వాహనం కొనుగోలుకి ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం
Weekly Rasi Phalalu In Telugu : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Weekly Horoscope 9 to 15 January 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఈ వారం వృషభరాశివారికి అనుకూల సమయం. ఆనందంగా ఉంటారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..అదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. చదువు విషయంలో పిల్లలు కొంత ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు శుభసమయం. ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగినా పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. పారిశ్రామిక వర్గాలవారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో కొంత ఒత్తిడి ఉంటుంది.ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఈ వారం సింహరాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగం మారాలనుకుంటే తొందరపడొద్దు. పెళ్లి సంబంధాలు కుదుర్చునేవారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మాటతూలి ఇతరులను అవమానించవద్దు. ఈ నెలలో పని భారం, ఒత్తిడి ఉంటుంది. వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త
కన్యా రాశి (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
కన్యారాశివారికి ఈవారం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వారం మీకు కెరీర్ పరంగా మంచిరోజు. ఉద్యోగులు కొత్త ఆలోచనలతో బాస్ ని మెప్పిస్తారు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పిల్లలతో గడిపేందుకు సమయం లేకపోవడం మిమ్మల్ని కొంత బాధపెడుతుంది. ఆర్థిక ఇబ్బందులను కొంతవరకూ అధిగమిస్తారు. తోబుట్టువులతో సంబంధాలు దెబ్బతింటాయి. తెలివితేటలతో మరియు విచక్షణతో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి గ్రహాలు అంత అనుకూలంగా లేవు, ఆరోగ్యం-ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త
తులా రాశి (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ1,2,3 పాదం)
ఈ వారం తులారాశివారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి సహకారం లభిస్తుంది.వ్యసనాలకు దరంగా ఉండండి. వినోదరంగంలో ఉన్నవారికి అనుకూల సమయం. వైవాహిక జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్య పరిష్కారమవుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదం)
ప్రస్తుతం శని ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు..వచ్చే వారం రాశిమారనున్నాడు. మీ రాశిలో సంచారించే ఆఖరి వారం మీకు అన్నీ సానుకూల ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక సంబంధిత విషయాలలో విజయం పొందవచ్చు. పెద్దల నుంచి ఆస్తులు పొందే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు రావచ్చు. కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ కూడా పూర్తవుతుంది. కొత్త వ్యాపారం పట్ల ఆసక్తి చూపుతారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి.
Also Read: భోగి మంటలకు అన్నీ రెడీ చేసుకుంటున్నారా, ఇవి మాత్రం వేయకండి!
మీన రాశి (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
2023 జనవరి 9 నుంచి 15 వరకు సమయం మీకు ముఖ్యమైనది. ఈ వారం మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల సమయం. ప్రేమికులు పెళ్లిదిశగా తమ బంధాన్ని తీసుకెళ్లవచ్చు. భూమి, భవనం, వాహనం కొనుగోలు గురించి ఆలోచించవచ్చు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఖర్చులు తగ్గించండి.