Weekly Horoscope 9 to 15 January 2023: ఈ వారం ఈ రాశులవారికి గ్రహాలు అంత అనుకూలంగా లేవు, ఆరోగ్యం-ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త
Weekly Rasi Phalalu In Telugu : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Weekly Horoscope 9 to 15 January 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
మేష రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. గ్రహాలు అంత అనకూలంగా లేవు...అందుకే ఆచితూచి అడుగేయాలి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అప్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టైతే ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించుకోండి.వ్యాపారులు మరింత కష్టపడాలి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలుంటాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
మిథున రాశి (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
మిథున రాశివారు ఈ వారం డబ్బు, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. డయాబెటిక్ రోగులైతే మరింత జాగ్రత్త. వ్యాపారం, ఉద్యోగం, చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ జీవిత భాగస్వామి తెలివితేటలను చూసి మీరు గర్వపడతారు. ఎలాంటి సమస్య వచ్చినా బయటపడేందుకు జీవిత భాగస్వామి సలహాలు ఉపయోగపడతాయి. అప్పులు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. వారం మధ్యలో శుభవార్త వింటారు.
కర్కాటక రాశి (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ వారం ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడినా అవసరాలకు డబ్బు చేతికందుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అడుగు ముందుకు వేస్తారు. కోపం కారణంగా పెద్ద నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో విభేదాలు రావొచ్చు. రాత్రిపూట ప్రయాణం చేయవద్దు. మీ ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండండి.
Also Read: భూమి, ఇల్లు, వాహనం కొనుగోలుకి ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం
వృశ్చిక రాశి (విశాఖ 4 పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ రాశి ఉద్యోగులు శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. వారం మధ్యలో ఆఫీసులో కొంత మార్పు రావచ్చు. వైవాహిక జీవితం బావుంటుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు.
ధనుస్సు రాశి(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)
ఈ వారం మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఆటంకం ఉంటుంది.ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పెట్టుబడిదారులకు కూడా కొంత అసంతృప్తి తప్పదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. విద్యార్థులు తమ లక్ష్యం పట్ల సీరియస్‌గా ఉండాలి. భూవివాదాలు తీరతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు
Also Read: కొత్త ఏడాదిలో మేషం నుంచి మీనరాశి వరకూ ఫలితాలు, 12 రాశుల వార్షిక ఫలితం
కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదం)
ఈ వారం కుంభరాశి వారు ఆకస్మిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు తప్పవు, అపార్థాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. క్రీడాకారులు, విద్యార్థులు మరింత కష్టపడాలి. వ్యాపారులు నూతన పెట్టుబుడులు పెట్టేముందు ఆలోచించండి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం.