By: RAMA | Updated at : 01 Jan 2023 01:28 AM (IST)
Edited By: RamaLakshmibai
Yearly Horoscope 2023 (Image Credit: Freepik)
Yearly Horoscope 2023: కొత్త ఏడాది ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలనిస్తోందో చూద్దాం....
మేష రాశి
ఈ రాశి వారికి కొత్త ఏడాది కలిసొస్తుంది. చురుగ్గా ఉంటారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది భూమి, భవనాలు కొనుగోలు చేయాలి అనుకుంటే ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. మీ ప్రేమ వ్యవహారాలు ఒడిదొడుకులతో సాగే అవకాశం ఉంది. సంతానంలో పురోగతి ఉంటుంది. న్యాయపరమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి
వృషభ రాశి
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో కొన్ని కష్టాలు తప్పకపోవచ్చు. మీరు కష్టపడితేనే మంచి ఫలితాలొస్తాయి. స్నేహితులు, సహోద్యోగుల సహకారం ఏడాది పొడవునా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఏడాదిలో అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు..ఆహారం,పానీయాల విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు ఏదైనా ఆస్తిని కొనాలంటే తొలి నెలల కంటే చివరి నెలల్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు అంతా మంచే జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటేనే మంచిది.
మిథున రాశి
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.అయితే మీరు మీరు అందరినీ ఎక్కువగా విశ్వసించడం మానుకోవాలి లేదంటే మోసపోవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించకపోతే ఆర్థిక ఇబ్బందలు తప్పవు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు ఇబ్బందలు తప్పవు. కష్టపడితే మీరు అనుకున్న ఫలితాలు రావొచ్చు. శత్రువుల వైపు నుంచి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవిత పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. వ్యాపారులకు కొత్త ఏడాదిలో మిశ్రమ ఫలితాలొస్తాయి.
Also Read: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు
కర్కాటక రాశి
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో కొన్ని ఇబ్బందుల తర్వాత శుభఫలితాలొస్తాయి. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది.. ఈ కారణంగా ఆస్తిని పొందే అవకాశాలు ఏర్పడతాయి. మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వస్తువును కొనుగోలు చేస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీకు తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ఏదైనా పనిని ఉత్సాహంగా చేయాలి. కొత్త ఏడాదిలో భూమి, వాహనం, ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి
ఈ రాశి వారు 2023లో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు సమస్యలు తగ్గుతాయి. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రులతో ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళతారు. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల సమయం.
కన్యా రాశి
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో కొంత పురోగతి లభిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా కొత్త ఏడాదిలో సాధారణంగా ఉంటుంది. ఖర్చులుతగ్గించండి..ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..లేదంటే చాలా ఇబ్బందులు ఉండొచ్చు. ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులు కష్టపడాలి. కోర్టు వ్యవహారాలు నిదానంగా సాగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సహకారం పెరుగుతుంది
తులా రాశి
ఈ రాశివారు కొత్త ఏడాదిలో అడుగడుగూ ఆలోచించి వేస్తారు. మీకు సంబంధించిన ఏవైనా పెద్ద పనులు పూర్తి కావొచ్చు. మీ కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది. ఈ కారణంగా మీరు పురోగతి సాధించగలరు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం లాభదాయకంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులతో అనుబంధాన్ని కొనసాగించండి. విద్యార్థులకు ఈ సంవత్సరం చదువుపై ఆసక్తి తగ్గుతుంది. వైవాహిక జీవితంలో సాధారణంగా ఉంటుంది.
Also Read: ఆ ఒక్క విషయంలో తప్ప 2023 బాగా కలిసొస్తుంది, కన్యారాశి వార్షిక ఫలితాలు
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. దాదాపు అన్ని విషయాలలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. వివిధ వనరుల నుండి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. పెండింగ్ పనులు పెండింగ్ లోనే ఉండిపోతాయి లేదంటే ఆలస్యం అవుతాయి. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రత్యర్థులతో అనవసరంగా వాదించకండి.అనవసర రాద్ధాంతం, అధిక ఖర్చుల వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి కోసం ప్రయత్నించాలి. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాహనం జాగ్రత్తగా నడపాలి. ఉద్యోగులకు శుభసమయం.
మకర రాశి
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు బదిలీకి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. తల్లిదండ్రుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారంలో కొంత సంయమనం పాటించాలి. వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది...కాబట్టి భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోవాలి. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారులు తెలివిగా పెట్టుబడులు పెట్టాలి.
కుంభ రాశి
ఈ రాశి వారు కొత్త ఏడాదిలో అనవసరమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఓర్పు, అవగాహనతో పని చేయాలి. భూమి, ఆస్తి, వాహనాల కొనుగోలు విక్రయాలలో ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. పిల్లల కారణంగా కొన్ని తేడాలుంటాయి. కోర్టు కేసుల్లో ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుంది.
మీన రాశి
ఈ రాశి వారికి కొత్త ఏడాది అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిల నుంచి లాభాలు పొందుతారు. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కొందరు వ్యక్తులకు ఈ కాలంలో సంగీత కళల వైపు మొగ్గు పెరుగుతుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు లాభాలు పొందుతారు.
K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు
Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు
Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు
ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?
Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?