News
News
X

Libra 2023 Horoscope: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు

Libra horoscope 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Libra horoscope 2023 : సంవత్సరం ప్రారంభంలో ఈ రాశివారు కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు...కానీ వాటినుంచి త్వరలోనే బయటపడతారు. తులారాశిలో జన్మించిన వ్యక్తులకు శని 4వ స్థానంలో ఉండడం వల్ల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. ఏడాది ఆరంభంలో బృహస్పతి 6వ స్థానంలో ఉండడం తరచూ శారీరక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది, ఆర్థిక వ్యయం కూడా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులుంటాయి...మొదట్లో సమస్యలు వచ్చినా ఆ తర్వాత సర్దుకుంటాయి. 2023 అక్టోబర్ లో రాహువు మీ రాశినుంచి ఆరవ ఇంట్లో సంచరిస్తాడు..ఆ సమయం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. శత్రువులపై విజయం ఉంటుంది. రాజకీయ నాయకులకు శుభసమయం. బహుళ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. 

Also Read: ఈ రాశివారు జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందనే ఆలోచనలో ఉంటారు, డిసెంబరు 20 రాశిఫలాలు

2023 తులా రాశి ఫలితాలు

 • 2023 ఆరంభంలో తులారాశివారి ప్రేమ బంధాలు, కుటుంబ సంబంధాల్లో హెచ్చుతగ్గులుంటాయి. అవివాహితులకు ఈ ఏడాదిలో పెళ్లి నిశ్చయమవుతుంది. 
 • కెరీర్ పరంగా తులా రాశి 2023లో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీ నైపుణ్యాలను గుర్తించి ముందుకుసాగడం మంచిది. నిరుద్యోగులకు శుభసమయం. కానీ  కానీ మీ అజాగ్రత్త తరచుగా ఉద్యోగాలు కోల్పోయేలా లేదా అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
 • ఆర్థిక పరంగా చూస్తే 2023లో తులారాశి వారికి అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఏడాది ఆరంభంలో నాల్గవ స్థానంలో ఉన్న శని ఫిబ్రవరి నాటికి ఐదో స్థానంలో వచ్చేసరికి చాలా మార్పులు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్న పనులు పూర్తయ్యేకొద్దీ జీవితం మారుతుంది.
 • అక్టోబర్ లో రాహు ఆరో స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం ఖర్చులు పెరుగుతాయి..జీవితంలో చిన్న చిన్న సమస్యలు తప్పవు
 • ఈరాశివారి ఆరోగ్యం ఏడాది ఆరంభంలో బలహీనంగా ఉన్నప్పటికీ రానురాను ఆ సమస్యల నుంచి బయటపడతారు.అయితే ఆరోగ్య సమస్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు

2023లో తులా రాశివారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలు

 • జనవరిలో శని సంచారం వల్ల చిన్నపాటి ఆటంకాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా చూసుకోవాలి. మీ భాగస్వామితో గొడవపడటం తరచుగా మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
 • ఫిబ్రవరిలో పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అప్పటి వరకూ ఎదుర్గొన్న సమస్యల నుంచి ఉపశమనం మొదలవుతుంది 
  మార్చి నెలలో మీ కుటుంబ జీవితం బావుంటుంది. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. ప్రేమికులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది.
 • ఏప్రిల్ లో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పూర్వీకులకు సంబంధించిన ఆస్తి లభిస్తుంది.
  మేలో మీకు అదృష్టం కలిసొస్తుంది. తలపెట్టిన పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కుటుంబంతో సమయం గడిపేందుకు సాధ్యమవుతుంది.
 • జూన్ నెలలో కెరీర్‌లో ఒడిదుడుకులు ఉంటాయి. తులారాశి వారు పని పట్ల శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. కుటుంబ వాతావరణం మెరుగ్గా ఉంటుంది.
 • జూలైలో అన్నింటా విజయం పొందుతారు. ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. కోరికలు నెరవేరుతాయి.
 • ఆగస్టులో మీ ఆదాయం పెరుగుతుంది. చిన్నపాటి అంతరాయం కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు పెరగడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
 • సెప్టెంబరులో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇది ఒత్తిడితో కూడిన సమయం.
 • అక్టోబర్ మీకు ఉత్తమ సమయం. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది
 • నవంబర్‌లో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది..ఖర్చులు పెరుగుతాయి
 • డిసెంబర్  మీకు అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది..ఆరోగ్య స్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023  కర్కాటక  రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023  సింహ  రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో కన్యారాశి ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 20 Dec 2022 06:46 AM (IST) Tags: libra horoscope 2023 yearly horoscope 2023 Yearly Rasi Phalalu 2023 Libra Rasi Phalalu 2023 2023 Thula Rasi Phalalu

సంబంధిత కథనాలు

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

Horoscope Today 29th January 2023: ఈ రాశులవారు ఈరోజు ఏం చేసినా మంచి ఫలితమే వస్తుంది, జనవరి 29 రాశిఫలాలు

Horoscope Today 29th January 2023: ఈ రాశులవారు ఈరోజు ఏం చేసినా మంచి ఫలితమే వస్తుంది, జనవరి 29 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు

Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు