చాణక్య నీతి: మనిషికి గొప్ప ఆస్తి ఏంటి, చాణక్యుడు ఏం చెప్పాడు!



శతాబ్దాలు గడిచినా, ఆచార్య చాణక్యుడి విధానాలు మనిషి జీవితంలో సరైన మార్గాన్ని చూపించడానికి పని చేస్తాయి.



ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి అంశాన్ని వివరించాడు, విజయాన్ని చేరుకునే మార్గాలు సూచించాడు



సంపద,విద్య,ఆస్తి,వైవాహిక జీవితం,స్నేహితులు,బంధువులు గురించి చాలా విషయాలు తెలియజేశాడు చాణక్యుడు



ఆచార్య చాణక్యుడి దృష్టిలో నిజమైన సంపద ఏంటంటే..ఆ వ్యక్తి జ్ఞానం, సంకల్ప శక్తి



జ్ఞానం,సంకల్ప శక్తి ఉంటే ఎంత పెద్ద కష్టాన్నుంచి అయినా బయటపడొచ్చని బోధించాడు చాణక్యుడు



జ్ఞాన సంపద, సంకల్ప శక్తి ఉన్న వ్యక్తి జీవితంలో ఏదైనా సమస్య చుట్టుముట్టినప్పుడు కుంగిపోయి కూర్చోడు..దాన్నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తాడు..ఆ దిశగా ప్రయత్నం ప్రారంభిస్తాడు



జ్ఞాని ఎక్కడికి వెళ్లినా కీర్తి సువాసనగల పూల వాసనలా వ్యాపిస్తుంది. తద్వారా తన సమస్యతో పాటూ ఎదుటివారి సమస్యను కూడా పరిష్కరిస్తాడు



తెలివైన వ్యక్తి స్వయంగా మంచి పనిలో నిమగ్నమై,ఇతరులను కూడా ముందుకు సాగేలా ప్రేరేపిస్తాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, అలాంటి వ్యక్తులు ఎప్పుడూ చెడ్డవారి సహవాసంలో ఉండరు.



నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఏదైనా పెద్ద విజయాన్ని సాధించిన తర్వాత కూడా ప్రగల్భాలు పలకడు.



చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి జ్ఞానసంపద కలిగి ఉండడమే మంచి ఆస్తి అయితే..ఆ జ్ఞానాన్ని పంచడం ద్వారా ఆ ఆస్తిని మరింత పెంచిన వారవుతారు..