చాణక్య నీతి: మీ వైవాహిక జీవితం బావుండాలంటే ఈ 4సూత్రాలు పాటించాలి
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కుటుంబం, వైవాహిక జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ప్రస్తావించాడు
సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అనేక విషయాలను ప్రస్తావించిన చాణక్యుడు..వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి ఉండాలంటే కొన్ని పాటించాలన్నాడు
చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఈ 4 విషయాలను పరిగణలోకి తీసుకుంటే వారి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది
1. మీ విషయాలు రహస్యంగా ఉంచండి భార్యాభర్తలిద్దరి మధ్యా ఉండే కొన్ని వ్యక్తిగత విషయాలను మూడో వ్యక్తితో పంచుకోవద్దు. భార్యాభర్తల మధ్య విషయాలు వారివద్ద ఉన్నప్పుడే వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగుతుంది
కొన్నిసార్లు రహస్య విషయాలు మూడో వ్యక్తి చెవికి చేరడం వల్ల దంపతుల మధ్య సమస్య తీరకపోగా..మరింత పెరుగుతుంది. కొన్నిసార్లు ఆ బంధానికి ఫుల్ స్టాప్ పడుతుంది
2.అహాన్ని పక్కనపెట్టండి వాహనంలో ఓ చక్రంలో లోపం ఉన్నా వాహనం నడవదు. భార్యాభర్తలు కూడా బండికి రెండు చక్రాలు. ఇద్దరూ కలిసి తమ బాధ్యతను నిర్వర్తిస్తే, దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది.
ఏ పని చేసినా ఇద్దరూ ఒకరికొకరు భాగస్వాములుగా ఉండాలి కానీ పోటీదారులుగా ఉండరాదు. మీ సంబంధంలో అహంకారం, అహం ఉంటే ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడదు
3.ఒకరినొకరు గౌరవించుకోవాలి భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమతో పాటు గౌరవాన్ని పంచుకున్నంత కాలం వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
భార్యాభర్తల మధ్య సంబంధంలో ప్రేమతో పాటు ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి. అవసరాలను అర్థం చేసుకోండి. అప్పుడే వైవాహిక బంధం బలపడుతుంది.
4.ఓపికపట్టండి సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఓపిక,సహనం చాలా అవసరం అంటాడు చాణక్యుడు.
సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం భార్యాభర్తలిద్దరూ సహనంతో ఉండాలి. మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యను సహనంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి.