చాణక్య నీతి: ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉంటుంది
సరైన మార్గాన్ని అనుసరించడం ద్వారా జీవితంలోని సవాళ్లతో పోరాడాలని ఆచార్య చాణక్యుడి విధానాలు మనిషికి నేర్పుతాయి
ప్రతి వ్యక్తి తన కుటుంబంలో దేనికీ కొరత ఉండకూడదని కోరుకుంటాడు. అలా జరగాలంటే లక్ష్మీదేవి కృప ఉండడం చాలా ముఖ్యమైనది.
లక్ష్మీ దేవి ఎవరిపై దయ చూపిస్తుందే వారి జీవితంలో సంతోషం మెండుగా ఉంటుంది. ధన, ధాన్యాలకు కొరతలేకుండా ఉంటే మిగిలిన సమస్యలని ఒక్కొక్కటిగా తీర్చుకోవచ్చంటాడు చాణక్యుడు..
లక్ష్మీదేవి ఎలాంటి ఇంట్లో కొలువైఉంటుందో చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు
కుటుంబంలో ప్రేమ చాణక్య నీతి ప్రకారం..ఇంట్లో అందరూ కలసిమెలసి ప్రేమగా ఉండాలి. ఏ కుటుంబంలో ఐతమత్యం ఉంటుందో ఆ ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది.
సానుకూల శక్తి ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తికి అవకాశం ఉండదు..అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆదాయం, ఆనందం, పురోభివృద్ధి రోజురోజుకీ పెరుగుతాయి
జ్ఞానులను గౌరవించండి నాకు తెలిసిందే వేదం, నేను చేసిందే కరెక్ట్ అనకుండా పెద్దలు, జ్ఞానులు, మహాత్ముల మాటలను గౌరవించాలి. వారి బోధనలు అనుసరించిన వారింట్లో ధనధాన్యాలకు కొదువ ఉండదు
మూర్ఖులను పట్టించుకోకండి గొప్పవారు చెప్పేమాటలు వినడం ఎంత ముఖ్యమో..మూర్ఖులు చెప్పే మాటలు పట్టించుకోపోవడం కూడా అంతే ముఖ్యం. మూర్ఖుల మాటలు పరిగణలోకి తీసుకోవడం వల్ల ఎదుగుదల ఆగిపోతుంది.
ఇంట్లో ఉన్న పెద్దలు ఆహారాన్ని గౌరవించినప్పుడు పిల్లలకు ఆ సంస్కారం నేర్పించగలుగుతారు. నచ్చినంత తినడం మిగిలినది పడేయం అనే అలవాటు మాన్పించాల్సిన బాధ్యత పెద్దలదే...
ఎవరైతే ఆహారాన్ని గౌరవిస్తారో, వృధాచేయకుండా ఉంటారో..అలాంటి వారు ఆకలితో ఉండే రోజు రానేరాదంటాడు చాణక్యుడు.
పనిచేసే సామర్థ్యం లేకపోతే సరేకానీ..సామర్థ్యం ఉండికూడా పనిచేయకుండా కూర్చుని తినేవారున్న ఇంట్లో లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఎవరి శక్తి సామర్థ్యాలకు మేరకు కష్టపడితేనే లక్ష్మీ, అన్నపూర్ణ అనుగ్రహం ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.