చాణక్య నీతి: మీ చుట్టూ ఉన్న మోసపూరిత వ్యక్తులను ,స్వార్థపరులను ఇలా గుర్తించాలి
సరైన మార్గాన్ని అనుసరించడం ద్వారా జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లతో పోరాడవచ్చని చాణక్యుడు చెప్పాడు
అదే సమయంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరు మోసపూరిత వ్యక్తులో, ఎవరు స్వార్థపరులో తెలుసుకోవడం చాలా అవసరం అని బోధించాడు
తెలివైన , జ్ఞానం ఉన్న వ్యక్తి సహవాసం మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. కానీ మీకు తెలియకుండానే మీరు స్వార్థపరులను వెన్నంటే ఉంచుకుంటే వెన్నుపోటు తప్పదన్నాడు చాణక్యుడు
మోసపూరిత వ్యక్తులతో సహవాసం చేసినా, ప్రేమలో పడినా మీకు ఇబ్బందులు తప్పవన్నాడు. ఇలాంటి వారిని గుర్తించడం ఎలాగో కూడా వివరించాడు చాణక్యుడు
మీకు కష్టం వచ్చినప్పుడు, అవసరమైన సమయంలో సాకులు వెతుక్కుంటూ తప్పించుకునేవారిని వీలైనంత త్వరగా గుర్తించాలి మీ ముందు మీరు అధ్భుతం అని మాట్లాడి..మీ వెనుకే మిమ్మల్ని చెడ్డచేసేవారిని గుర్తించకపోతే మునిగిపోతారు
కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యక్తులను గుర్తించినప్పటికీ..వారి ఉద్దేశం అలా అయి ఉండదులే అని సరిపెట్టుకునే వారుకూడా ఉన్నారు. కానీ దాని ఫలితం భవిష్యత్ లో అనుభవిస్తారు
మనసులో ఉన్న విషయాన్ని సూటిగా,స్పష్టంగా చెప్పే వ్యక్తులు ఎప్పటికీ ఎవ్వర్నీ మోసం చేయలేరు. అలాంటి వారి హృదయం నిర్మలంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు నమ్మినవారిని మోసం చేయాలని అస్సలు అనుకోరు
ఉదాహరణ చెప్పాలంటే.. మోసపూరిత వ్యక్తి అవసరమైన సమయంలో మీ నుంచి అప్పుతీసుకుని.. తిరిగి ఇచ్చే విషయంలో వంద సాకులు చెబుతాడు. కొందరైతే మిమ్మల్ని తప్పించుకునేందుకు నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తారు.
మిమ్మల్ని తమ అవసరాలకు వినియోగించుకుని..మీ అవసరానికి ముఖం చాటేసేవారు ఎప్పటికీ మీ శ్రేయోభిలాషులు కాదు. పైగా ఇలాంటి స్వార్థపరులు, మోసగాళ్లు తమ మంచి కోసమే ఆలోచిస్తారు. కాబట్టి ఈ వ్యక్తులను వదిలివేయడమే మంచిది.
ఇలాంటి వ్యక్తుల ఉద్దేశం, స్వభావాన్ని గుర్తించడం ద్వారా వీలైనంత త్వరగా వారిని వదిలించుకోగలుగుతారు. లేదంటే వారినుంచి మీకు ఇబ్బందులు పొంచి ఉన్నట్టే...