దసరా 2022: శరన్నవరాత్రులు ఎందుకంత పవర్ ఫుల్



సృష్టికి మూలమైన అమ్మవారు విశేషంగా పూజలందుకునేది, ఆడపిల్లల వేడుకైన అట్లతద్ది, తెలంగాణలో బతుకమ్మ ఇవన్నీ ఆశ్వయుజ మాసంలోనే. అందుకే ఆశ్వయుజాన్ని శక్తిమాసం అంటారు.



కాలాన్ని స్త్రీ పురుష రూపాత్మకంగా చెబుతారు. ఏడాదిలో చైత్రం మొదలు భాద్రపద మాసం వరకూ పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకం.



ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలోని తొలి మాసం ఆశ్వయుజం..అందుకే అమ్మవారి ఉపాసనకు ఈ నెల చాలా ప్రత్యేకం అని చెబుతారు పండితులు



ఉపాసనకు సంబంధించి ఆశ్వీయుజ మాసం మొదటి మాసం అవుతుంది. ఈ నెల ఆరంభంలోనే శారదా నవరాత్రులు పేరుతో తొమ్మిది రోజులు ఉపాసన చేస్తారు



దీనివెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఆరంభంలో 9 రాత్రులు కలపి ఒకరోజు ప్రారంభంలో ఉండే తెల్లవారు ఝాముతో సమానమని చెబుతారు. అంటే సూర్యోదయానికి ముందున్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తాం కదా అలా అన్నమాట



సంవత్సరం మొత్తాన్ని ఒక రోజుగా భావిస్తే అందులో తల్లవారుఝాము కాలం ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకూ ఉండే కాలం. ఈ 9 రాత్రులను బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు. అందుకే ఉపాశనకు నవరాత్రులు అత్యంత యోగ్యమైనవి అని చెబుతారు.



హిందూ ధర్మంలో బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది.
వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||



దీనర్థం బ్రాహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపన్నలవుతారు.



ఈ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేల్కొంటాయి. వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి. తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది.



ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్య పరుస్తుంది. అందుకే ఉపాసనకు బ్రాహ్మ ముహూర్తంగా భావించే శరన్నవరాత్రుల్లో అత్యంత శక్తి దాగిఉందని చెబుతారు.



ఈ తొమ్మిది రాత్రులు, తొమ్మిది పగలు క్రమం విడిచిపెట్టకుండా దైవచింతనలో ఉండాలని చెబుతారు.