నవరాత్రుల తొమ్మిది రోజుల్లో దుర్గమ్మ తొమ్మిదిరూపాలను పూజిస్తారు.అమ్మవారిని పూజించే ఈ తొమ్మిది రోజులూ కొన్ని నియమాలు పాటించాలి అవేంటంటే...
పూజ చేసేటప్పుడు మధ్యలో లేవకండి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏం చేస్తున్నా..పూజ, మంత్ర పఠనం, చాలీశా, స్తుతి..ఏదైనా కానీ మధ్యలో అస్సలు లేవకూడదు.
దుర్గా శ్లోకాలు చదువుతున్న సమయంలో ఎవ్వరితోనూ మాట్లాడకూడదు, వేరే పని నిమిత్తం లేవకూడదు. దీనివల్ల పూజనుంచి వచ్చే అనుకూల ఫలితాలు కన్నా మీ చుట్టూ ప్రతికూల శక్తి పెరుగుతుందంటారు.
పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి సాధారణంగా పూజ, వ్రతం, నోము, పండుగ అనేకాదు..పరిశుభ్రత పాటించడం అందరికీ చాలా అవసరం. అయితే శరన్నవరాత్రుల్లో ఇది మరికొంచెం ఎక్కువగా ఉండాలి..
తెల్లవారుజామునే స్నానం ఆచరించిన తర్వాతే దేవుడి మందిరంలో అడుగుపెట్టాలి. స్నానం అనంతరం దేవుడి పాత్రలు శుభ్రం చేసుకుని శుచిగా నైవేద్యం వండిపెట్టి పూజచేయాలి. పూజ సమయంలో ధరించే దుస్తులు ప్రత్యేకంగా పెట్టుకోవాలి...
లెదర్ వస్తువులు ధరించవద్దు పూజ సమయంలో తోలుతో చేసిన వస్తువులు ధరించి పూజా మందిరంల అడుగుపెట్టకూడదు. లెదర్ వస్తువులు ధరించి పూజకు కూర్చుంటే అనుకూల ఫలితాలు కన్నా ప్రతికూల ఫలితాలే ఎక్కువ ఉంటాయని చెబుతారు పండితులు
పగటిపూట నిద్రపోవద్దు విష్ణు పురాణం ప్రకారం శరన్నవరాత్రులు చేస్తున్నవారు పగటిపూట నిద్రించడం నిషిద్ధం. ఉపవాసం ఉండేవారైతే ఈ తొమ్మిది రోజు పగటివేళ అమ్మవారి కీర్తలతో సమయం గడపాలి.
మాంసాహారం,ఉల్లిపాయ, వెల్లుల్లి తినొద్దు మత విశ్వాసాల ప్రకారం నవరాత్రులలో ఉల్లిపాయ, వెల్లుల్లి , మాంసాహారం ఇంట్లో వండకూడదు. బయటి నుంచి తెచ్చుకుని కూడా తినకపోవడమే మంచిదంటారు పండితులు.
నియమ నిష్టలతో తొమ్మిదిరోజుల పాటూ అమ్మవారికి పూజలు చేస్తున్న ఇంట్లో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం మంచిది
గోళ్లు, గడ్డం, మీసం, జుట్టు కత్తిరించకూడదు నవరాత్రి తొమ్మిది రోజులు గడ్డం, మీసాలు, జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. (నోట్: పండితులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన విషయాలివి..వీటిని ఎంతవరకూ అనుసరించాలి, అనుసరించాల్సిన అవసరం లేదు అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం)