అన్వేషించండి

ఆగష్టు 26 రాశిఫలాలు - శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఈ రాశివారి సక్సెస్ ను ఎవ్వరూ అడ్డుకోలేరు!

Horoscope Prediction 26 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 26 August 2024 

మేష రాశి

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మానసికంగా గందరగోళంలో ఉన్నప్పుడు... కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సానుకూల ఆలోచనలు స్వాగతించండి. 

వృషభ రాశి 

ఈ రోజు ఈ రాశివారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే సరైన సమయం. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

మిథున రాశి

ఆస్తికి సంబంధించిన విషయాల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఉండే సమస్యల పరిష్కారంపై తగిన శ్రద్ధ చూపించండి. సంతోషం-బాధ రెండూ జీవితంలో భాగమే అని గుర్తించండి. కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు ముందుకువేయండి. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. ఓ సంబంధం సంతోషాన్ని మాత్రమే ఇస్తుందని భావించి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. 

Also Read: ఈ ఆలయంలో కృష్ణుడికి.. ముందు నైవేద్యం ఆ తర్వాతే పూజ - ఇక్కడ అత్యంత ప్రత్యేకం 'తిడంబు' నృత్యం!

కర్కాటక రాశి

ఈ రాశివారు బాధ్యతలన్నీ ఒంటరిగానే మోయాలని అనకోవద్దు. ఇంట్లో అయితే కుటుంబ సభ్యులకు ... కార్యాలయంలో అయితే సహోద్యోగులతో పనని పంచుకోండి. అధికఒత్తిడికి దూరంగా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. మరో మార్గం లేదనుకుని ప్రతి విషయంలో రాజీపడి బతకొద్దు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి. 

సింహ రాశి

ఈ జీవితంలో సానుకూల మార్పులు వచ్చే సమయం ఇది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. గతంలో నష్టపోయిన విషయాలపై కాకుండా భవిష్యత్ లో లాభపడే విషయాలపై దృష్టి పెట్టండి. ఈ రోజు మీరు వేసుకునే ప్రణాళిక మీ భవిష్యత్ కి చాలా ఉపయోగపడుతుంది. 
  
కన్యా రాశి 

ఈ రాశివారు అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించవద్దు. మీ ఫ్యూచర్ బావుంటుంది..ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నించండి.  మీ చుట్టూ ఉండే వ్యక్తులలో మిమ్మల్ని ఉపయోగించుకునేవారే అధికంగా ఉన్నారు ఆ విషయం ఆలోచించండి. అనవసర ఒత్తిడి లోనుకావొద్దు. మీపై మీరు నమ్మకం ఉంచుకుంటే అంతా మంచే జరుగుతుంది.  

Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి!

తులా రాశి

ఈ రోజు మీరు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబంలో ఉండే సమస్యల పరిష్కారానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచిరోజు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎప్పటినుంచో రావాల్సిన మొత్తం తిరిగి చేతికందుతుంది.  

వృశ్చిక రాశి

ఈ రాశివారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించేందుకు ఇదే సరైన సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

ధనస్సు రాశి
 
ఈ రాశివారు ఈ రోజు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. ఆస్తికి సంబంధించిన సమస్యలుంటే పరిష్కారం అవుతాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read: కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీ కృష్ణుడి విశ్వరూపాన్ని చూసిన అర్జునుడి మానసిక స్థితి!
 
మకర రాశి

ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. అనుకున్న పనుల్లో అడ్డంకులు తప్పవు. అనవసర విషయాలపై ఎక్కువ చర్చలు పెడతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగత జీవితంలో ఉండే సమస్యల పరిష్కారానికి పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. కార్యాలయంలో అందర్నీ మెప్పించేందుకు పని ఒత్తిడి పెంచుకోవద్దు. 

కుంభ రాశి

ఈ రాశివారికి ఈరోజు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీకోసం మీరు సమయాన్ని వెచ్చిస్తే చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోవద్దు..ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. నిరుద్యోగులు..వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

మీన రాశి

ఈ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. మీరు అనుకున్నది సాధించకుండా మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.  

Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీ బంధు, మిత్రులకు ఇలా తెలియజేయండి!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
GTA 6: జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Embed widget