Happy Krishna Janmashtami 2024 wishes in Telugu: శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీ బంధు, మిత్రులకు ఇలా తెలియజేయండి!
Sri Krishna Janmashtami Wishes in Telugu 2024: శ్రావణ బహుళ అష్టమి రోజు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారంతా... ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి...
Sri Krishna Janmashtami 2024: ఈ బ్రహ్మాండాన్ని ఉద్ధరించేందుకు శ్రీ మహా విష్ణువు తన ఎనిమిదో అవతారంగా శ్రీ కృష్ణుడిగా జన్మించాడు. కృష్ణ పరమాత్ముడు దేవకీ గర్భాన.. శ్రావణ బహుళ అష్టమి రోజు అర్థరాత్రి చెరశాలలో జన్మించాడు. ఈ రోజునే కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. కన్నయ్య బాల్యం మొత్తం గోకులలంలో సాగడంతో గోకులాష్టమి కూడా అని కూడా అంటారు. ఆగష్టు 26 కృష్ణాష్టమి...ఈ సందర్భంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.
Also Read: శ్రీ కృష్ణుడు స్త్రీ లోలుడా..16 వేల మందితో శృంగారం చేశాడా..మీ ప్రశ్నలకు సమాధానం ఇదిగో!
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
ఓం దేవకీనందనాయ విద్మహే రుక్మణి వల్లభాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్ ॥
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
శ్రీకృష్ణాయ విద్మహే దామోదరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ॥
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ
నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా"
అందరకీ శ్రీకృష్ణాష్టమి శుభకాంక్షలు!
కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి.
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ బంగారు మెలతాడు పట్టుదట్టి
సందిట తాయెత్తులు సరి మువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
Also Read: ద్వారక నీట మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచీ అక్కడ ఏం జరిగిందో తెలుసా..!
నువ్వు కేవలం కర్మలు చేయడానికే గానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు
ప్రతిఫలాపేక్షతో కర్మలను ఆచరించకు... అలాగని కర్మలు చేయడం మానకు”
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకోసం శ్రీకృష్ణుడు అవతరించిన పర్వదినం
మీ జీవితంలో కష్టాలు తొలగి సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటూ
మీ అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
భగవంతుడిగా కాదు గురువుగా మీమ్మల్ని వెలుగు వైపు నడిపించాలి
శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
నల్లటి మేఘంలోంచి సూర్యుడు బయటకు వచ్చినట్టు
అజ్ఞానం అంతరించిన తర్వాతే జ్ఞానం వెలుగుచూస్తుంది
అది శ్రీకృష్ణుడి ప్రార్థనతోనే సాధ్యం
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
ప్రతి మనిషికి చావు పుట్టుక తప్పుదు..
వివేకవంతులు వీటి గురించి ఆలోచించరు
అందరకీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
నీకు నువ్వే ఆప్తుడివి..నీకు నువ్వే శత్రువువి
నీకు నువ్వే ఇచ్చుకుంటే నీకు నువ్వే అధిపతివి
నీ ఆలోచనే నిన్ను నడిపిస్తుంది
అందరకీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
నీ కర్తవ్యాన్ని సక్రమంగా నువ్వు నిర్వర్తించడమే యోగం
నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
కృష్ణం వందే జగద్గురుమ్
Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024 ఆగష్టు 26 or 27 - ఎప్పుడు జరుపుకోవాలి!