Mysteries of The Underwater City Dwarka: ద్వారక నీట మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచీ అక్కడ ఏం జరిగిందో తెలుసా..!
Janmashtami 2024: శ్రీ కృష్ణుడు అవతారం చాలించాడు..అనంతరం ద్వారక సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి? ద్వాపరయుగం ఎలా అంతమైంది? ద్వారక నీట మునగకముందు అక్కడ ఏం జరిగింది?
Mysteries of The Underwater City Dwarka: ద్వారక..ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు పాలించిన మహానగరం ఇప్పుడు సముద్రగర్భంలో ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనావాళ్లు ఎన్నో ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. ఇంతకీ శ్రీ కృష్ణుడు పాలించిన ఈ నగరం ఎందుకు నీట మునిగింది? అందుకు గల కారణాలేంటి? ద్వారక సముద్ర గర్భంలోకి చేరకముందు అక్కడ ఏం జరిగింది?
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ద్వారక నీట మునిగిపోవడానికి కారణాలెన్నో..వాటిలో ముఖ్యమైనవి..
1. గాంధారి శాపం
2. ముసలం
3. అవతార పరిసమాప్తి
1. గాంధారి శాపం
కురుక్షేత్ర మహా సంగ్రామంలో తన సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ఏడుపు యుద్ధభూమిలోంచి వినిపిస్తుంది. ఆ సమయంలో అక్కడకు శ్రీ కృష్ణుడు, పాండవులు వెళతారు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి..శ్రీకృష్ణుడిని నిందించడం ప్రారంభిస్తుంది. నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు రూపం అయిన నువ్వు కూడా నా గర్భశోకాన్ని ఆపలేకపోయావంటుంది. నీ తల్లి దేవకిని అడిగితే తెలుస్తుంది కడుపుకోత అంటే ఏంటో ( దేవకికి కృష్ణుడి కన్నా ముందు పుట్టిన ఏడుగురు సంతానాన్ని కంసుడు చంపేస్తాడు) తెలుస్తుందంటూ శోకాలు పెడుతుంది. ఆమె ఆవేశాన్ని చూసిన తర్వాత కూడా చిరునవ్విన కృష్ణుడు..ఇదంతా జరుగుతుందని ముంచే దుర్యోధనుడిని హెచ్చరించానని సమాధానం చెబుతాడు. అప్పటికీ ఆమెలో ఆగ్రహం చల్లారదు..నాకున్న విష్ణు భక్తి నిజమైతే..నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే..ఈ రోజు నుంచి సరిగ్గా 36 ఏళ్ల కి నువ్వు మరణిస్తారవని శాపం ఇస్తుంది. అంతే కాదు..యాదవులంతా కొట్టుకు చనిపోతారు..ద్వారక నీట మునిగిపోతుందంటుంది. అప్పటికి కానీ ఆమె ఆవేశం చల్లారలేదు..ఆ తర్వాత వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుంది..కానీ ఆ శాపాన్ని అంగీకరిస్తున్నా అని చెబుతాడు కృష్ణుడు. ఈ శాప ఫలితంగానే కృష్ణుడు..ద్వారకను 36 ఏళ్లు మాత్రమే పాలించాడు..
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
2. ముసలం
కురుక్షేత్రం అయిన తర్వాత ద్వారక చేరుకున్న కృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు. శ్రీకృష్ణుడు- జాంబవతికి పుట్టిన కొడుకే సాంబుడు. ఓ సారి శ్రీ కృష్ణుడి దర్శనార్థం ద్వారకకు వచ్చిన సప్తరుషులను ఆటపట్టిస్తాడు సాంబుడు. ఆడపిల్ల వేషంలో వెళ్లి తనకు ఏ బిడ్డ పుడతారో చెప్పమని అడుగుతాడు. అసలు విషయం తెలిసి ఆగ్రహించిన సప్తర్షులు.. యాదవవంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి..వెనక్కు వెళ్లిపోతారు. ఆ తర్వాత ఈ శాపం గురించి తెలుసుకున్న కృష్ణుడు..ఇది జరగక తప్పదు అనుకుంటాడు. ఆ తర్వాత సాంబుడి కడుపులోంచి రోకలి పుడుతుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ రోకలిని పిండిచేసి సముద్రంలో కలిపేస్తారు యాదవులు.
కానీ గాంధారి శాపం, మహర్షుల శాపం నుంచి తప్పించుకోవడం సాధ్యంకాదు కదా...
రోకలి పుట్టినప్పటి నుంచి ద్వారకలో వాతావరణం మారిపోయింది. ఊహించని ఉత్పాతాలు చుట్టుముట్టడం మొదలెట్టాయి. రాత్రివేళల్లో చిలుకలు గుడ్లగూబల్లా అరవడం...పగలు మేకలు నక్కల్లా అరవడం , ఆవులకు గాడిదలు, ముంగిసలకు ఎలుకలు పుట్టడం జరిగింది. శ్రీకృష్ణ బలరామ సోదరులు మినహా మిగిలిన యాదవులంతా ఒకర్నొకరు హింసించుకోవడం మొదలెట్టారు. స్త్రీలు సిగ్గువిడిచి సంచరించారు.. అప్పుడే వండిన ఆహార పదార్థాల్లోంచి పురుగులు వచ్చాయి.ఎక్కడ చూసినా అశుభ సూచనలే...
Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024 ఆగష్టు 26 or 27 - ఎప్పుడు జరుపుకోవాలి!
ఇక గాంధారి , సప్తర్షుల శాపం ఫలించే సమయం వచ్చేసిందని కృష్ణుడికి అర్థమైంది...
సముద్ర తీరంలో చనిపోవడం ఉత్తమం అని భావించిన కృష్ణుడు..జాతరకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చాడు. అవసరమైనా ఆహార పదార్థాలు తీసుకుని జాతరకు వెళ్లారు ద్వారక వాసులు. అందరూ సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళ్లిపోతాడు. రాజు అయిన కృష్ణుడి ఎదురుగానే పానీయాలు సేవించడం, వాదనలకు దిగడం మొదలుపెట్టారు. ప్రద్యమ్నుడు , కృతవర్మ, సాత్యకి వీళ్లంతా ఒకర్నొకరు ఎగతాళి చేసుకున్నారు. వాగ్వాదం పెరిగి కృతవర్మ తల నరికేశాడు సాత్యకి. సముద్రతీరంలో మొలిచిన తుంగకి రోకలి ప్రభావం ఆక్రమించింది ఉంది.. అక్కడ నుంచి తీసిన కత్తి అది. కృష్ణుడు వారించేందుకు వెళ్లేలోగానే తుంగ పీకి ఒకర్నొకరు కొట్టుకుని ప్రాణాలు విడుస్తారు.
Also Read: మన దేశంలో ప్రముఖ శ్రీ కృష్ణ దేవాలయాలు..ప్రతి ఆలయం ప్రత్యేకమే!
3. ద్వాపర యుగాంతం
ప్రాణాలతో మిగిలిన దారుకుడూ, బభ్రుడిని తీసుకుని బలరాముడు వెళ్లిన మార్గంలోనే కృష్ణుడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడి కాలుని పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడం కృష్ణావతారం చాలించడం జరిగింది. ఆ తర్వాత ద్వారక నీటముగిని ద్వాపరయుగం అంతం కాగా..కలియుగం ఆరంభమైంది...