కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారో తెలుసా!

Published by: RAMA

దేవుళ్లు, మహర్షులంతా ఉత్తరాయణంలోనే జన్మించారు..కానీ శ్రీ కృష్ణుడు మాత్రం దక్షిణాయనంలో జన్మించాడు

ఉత్తరాయణం పగటికి ప్రతీక అయితే దక్షిణాయనం రాత్రి(చీకటి)కి ప్రతీక

దక్షిణాయనం కర్మకి ఆధారం..శ్రావణమాసం వర్షరుతువు అంటే వెన్నెల జాడే ఉండదు

అమావాస్య ముందు వచ్చే అష్టమి అంటే చిమ్మ చీకటి..పైగా అర్థరాత్రి జననం

మనిషి ఎక్కడ ఉండకూడదు అని అనుకుంటాడో..అక్కడే (చెరశాల) జన్మించాడు కృష్ణుడు

మనిషి జీవితంలో ఉండే అజ్ఞానం, అవివేకాన్ని చీకటితో పోల్చిచెబుతారు

ఆ అంధకారాన్ని తొలగించి..జ్ఞానం అనే వెలుగువైపు నడిపించాలని కోరుతూ కృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు

అందుకే బయటి నుంచి ఇంటి లోపలకు కృష్ణుడి అడుగులు వేస్తారు...

అజ్ఞానాన్ని తొలగించేది గురువే..అందుకే కృష్ణుడిని భగవంతుడిగా కన్నా గురువుగానే భావించాలంటారు