శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024: దక్షిణాదిన శ్రీ మహావిష్ణువు దివ్యక్షేత్రాలివే!

Published by: RAMA

తిరుమల - ఆంధ్రప్రదేశ్
కలియుగప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన క్షేత్రం

రంగనాథస్వామి ఆలయం - శ్రీరంగం (తమిళనాడు)
భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో రంగనాథుడ ఆదిశేషునిపై దర్శనమిస్తాడు.

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)
తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయంలో.. పాలసముద్రంలో శేషపాన్పుపై పవళిస్తున్న శ్రీహరి రూపాన్ని దర్శించుకోవచ్చు

కల్లలగర్ ఆలయం - మధురై (తమిళనాడు)
శ్రీ మహావిష్ణువు 108 దివ్యక్షేత్రాల్లో ఇదొకటి. ద్రవిడ నిర్మాణ శైలిలో ఆలయం అద్భుతంగా ఉంటుంది

త్రిచిట్టట్ మహా విష్ణు దేవాలయం - చెంగన్నూర్ (కేరళ)
వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించగా..ధర్మరాజు పునరుద్ధరించాడని చెబుతారు

ఆదికేశవ పెరుమాళ్ ఆలయం - కన్యాకుమారి (తమిళనాడు)
దక్షిణాదిన ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఇదొకటి. ఇక్కడ కూడా స్వామివారిని మూడు ద్వారాల గుండా దర్శించుకోవాలి

ఆగష్టు 26 శ్రీ కృష్ణ జన్మాష్టమి..ఈ సందర్భంగా ఈ ఆలయాలను సందర్శించుకోవచ్చు

ఓం నమో నారాయణాయ