అన్వేషించండి

Krishna Janmashtami 2024 Date: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024 ఆగష్టు 26 or 27 - ఎప్పుడు జరుపుకోవాలి!

Krishna Janmashtami 2024: శ్రీ కృష్ణజన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి.. ఆగష్టు 26 సోమవారమా - ఆగష్టు 27 మంగళవారమా? అష్టమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఉంది

Krishna Janmashtami 2023 Date and Shubh Muhurat:  పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకునే నిర్ణయిస్తారు. ఏ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు...అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు. ఈ సారి కృష్ణాష్టమి విషయంలో ఆగష్టు 26 సోమవారమే పండుగ అని పండితులు నిర్ణయించారు. అయితే ఆరోజు సూర్యోదయం తర్వాత అష్టమి తిథి వచ్చింది..మర్నాడు ఆగష్టు 27 మంగళవారం సూర్యోదయం అయిన వెంటనే నవమి వచ్చేస్తోంది. అందుకే ఆగష్టు 26 సోమవారమే కృష్ణాష్టమి జరుపుకోవాలి.  

Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
 
అష్టమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు
ఆగష్టు 26 సోమవారం ఉదయం 8 గంటల 40 నిముషాల వరకూ సప్తమి ఉంది..ఆ తర్వాత అష్టమి ఘడియలు మొదలయ్యాయి.
ఆగష్టు 27 మంగళవారం ఉదయం 6 గంటల 49 నిముషాలకు అష్టమి ఘడియలు వెళ్లిపోతున్నాయి..నవమి మొదలవుతుంది..
 
శ్రీ కృష్ణుడి జన్మనక్షత్రం రోహిణి 
ఆగష్టు 26 సోమవారం రాత్రి 9 గంటల 23 నుంచి ఆగష్టు 27 మంగళవారం రాత్రి 8 గంటల 30 నిముషాలవరకూ ఉంది. 
 
కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి?

సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు.  నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే పంచాంగకర్తలంతా ఆగష్టు 26 సోమవారం రోజంతా అష్టమి తిథి ఉండడంతో ఈ రోజే కృష్ణాష్టమి అని నిర్ణయించారు.  శ్రావణమాసంలో అమవాస్య ముందువచ్చే అష్టమి రోజు అర్థరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు..మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోద దగ్గరకు చేరుకున్నాడు. అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడిన అష్టమినే సెలబ్రేట్ చేసుకుంటారు. 

Also Read: అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!
 
గోకులాష్టమి

శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల ఈ రోజుని గోకులాష్టమిగా కూడా జరుపుకుంటారు. ఈరోజంతా కొందరు ఉపవాసం చేస్తే మరికొందరు ఓ పూట భోజనం చేస్తారు. కృష్ణుడి ఆలయాలు దర్శింకుంటారు.ఈ రోజు వైష్ణవ ఆలయాల్లో అష్టోత్తర , సహస్రనామ పూజలు చేయించుకునేవారికి వంశాభివృద్ధి,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. భక్తిశ్రద్ధలతో కన్నయ్యను పూజిస్తే సకల పాపాలు నశించి, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంధ పురాణం చెబుతోది. 

సంతాన గోపాల వ్రతం

వివాహం కానివారు, సంతానం లేనివారు శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు సంతానగోపాలవ్రతం ఆచరిస్తారు. ఈ రోజు సంతానగోపాల వ్రతం ద్వారా బాలగోపాలుడిని పూజిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయంటారు. 

భాగవత పఠనం

శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు భాగవతం, భగవద్గీత పఠించాలి. కన్నయ్య అర్థరాత్రి దేవకీ గర్భాన జన్మించాడు కాబట్టి...రోజంతా ఉపవాసం ఉంది అర్థరాత్రి కృష్ణుడు ఉద్భవించిన సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు..మర్నాడు ఉదయం వైష్ణవ ఆలయాలను సందర్శించి ఉపవాసం విరమిస్తారు. 

Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!
 
శ్రీ కృష్ణాష్టకం

వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్దనం |
దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుమ్‌ || 

అతసీపుష్పసంకాశం - హారనూపురశోభితం |
రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుమ్‌ ||  

కుటిలాలకసంయుక్తం - పూర్ణచంద్రనిభాననం |
విలసత్కుండలధరం - కృష్ణం వందే జగద్గురుమ్‌ ||  

మందారగంధసంయుక్తం - చారుహాసం చతుర్భుజం |
బహీర్పింఛావచూడాంగం - కృష్ణం వందే జగద్గురుమ్‌ ||  

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం - నీలజీమూతసన్నిభం |
యాదవానాం శిరోరత్నం - కృష్ణం వందే జగద్గురుమ్‌ || 

రుక్మిణీకేళిసంయుక్తం - పీతాంబరసుశోభితం |
అవాప్తతులసీగంధం - కృష్ణం వందే జగద్గురుమ్‌ ||  

గోపికానాం కుచద్వంద్వం - కుంకుమాంకితవక్షసం |
శ్రీనికేతనం మహేష్వాసం - కృష్ణం వందే జగద్గురుమ్‌ || 

శ్రీవత్సాంకం మహోరస్కం - వనమాలావిరాజితం |
శంఖచక్రధరం దేవం - కృష్ణం వందే జగద్గురుమ్‌ ||  

కృష్ణాష్టక మిదం పుణ్యం - ప్రాతరుత్థాయ యః పఠేత్‌ |
కోటిజన్మకృతం పాపం - స్మరణేన వినశ్యతి ||  

ఇతి శ్రీ కృష్ణాష్టకం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
Andhra Pradesh News: ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
Andhra Pradesh News: ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
TG TET 2024: తెలంగాణ టెట్‌లో ఏ పేపర్‌కు ఎవరు అర్హులు? పరీక్షఎలా ఉంటుంది?
తెలంగాణ టెట్‌లో ఏ పేపర్‌కు ఎవరు అర్హులు? పరీక్షఎలా ఉంటుంది?
Nirmal District News: నిర్మల్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి- మహారాష్ట్ర దాటిందనుకుంటే కుంటాలలో ప్రత్యక్షం
నిర్మల్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి- మహారాష్ట్ర దాటిందనుకుంటే కుంటాలలో ప్రత్యక్షం  
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
Embed widget