Krishna Janmashtami 2024: శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి!
Janmashtami 2024: గురువు అంటే చీకటి లోంచి వెలుగులోకి, అజ్ఞానం లోంచి జ్ఞానంవైపు నడిపించే మార్గదర్శి. అందుకే కృష్ణుడిని దేవుడిగా మాత్రమే కాదు గురువుగా కూడా భావించి పూజలందిస్తారు...
Krishna Janmashtami Janmashtami Detailed Puja Procedure: ఈ ఏడాది ఆగష్టు 26న కృష్ణాష్టమి వచ్చింది. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయడం, నియమాలు పాటిస్తూ ఉపవాసం చేయడం, రోజంతా కృష్ణ ధ్యానంలో ఉండడం వల్ల కన్నయ్య అనుగ్రహానికి పాత్రులవుతారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి పూజా విధానం
సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి..ఇంటిని శుభ్రం చేయాలి. దేవుడి మందిరంలో ముగ్గువేసి, అందంగా అలంకరించిన తర్వాత ఓ పీఠంపై ఎర్రటి వస్త్రం పరిచి దానిపై శ్రీ కృష్ణుడి విగ్రహం ఉంచండి. దీపం, ధూపం, నైవేద్యం..ఇలా షోడసోపచారాలతో పూజించండి. పంచామృతాలతో, గంగాజలంతో శ్రీ కృష్ణుడికి అభిషేకం చేసి...నూతన వస్త్రాలు ధరింపచేయాలి. అష్టగంధ, చందనం, అక్షతలతో తిలకం పెట్టాలి. వెన్న, పంచదార, పంచాద్య నైవేద్యాలు నివేదించాలి..
కృష్ణాష్టమి రోజు ఉపవాసం కానీ, అనారోగ్య కారణాలతో ఒకపూట భోజనం చేసినా కానీ.. వైష్ణవ ఆలయాలను సందర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలం ఉంటుందంటారు పండితులు. జన్మాష్టమి రోజు బంగారంతో గానీ, వెండితో గానీ చంద్రుడిని తయారు చేయించి అర్ఘ్యమిస్తే కోర్కెలు తీరుతాయని భవిష్యత్ పురాణంలో ఉంది. వివాహానికి, సంతానానికి సంబంధించిన సమస్యలున్నవారు ఈ రోజు సంతానగోపాల వ్రతం ఆచరిస్తారు.
Also Read: కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీ కృష్ణుడి విశ్వరూపాన్ని చూసిన అర్జునుడి మానసిక స్థితి!
శ్రీ కృష్ణాష్టకం నిత్యం చదివితే విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది
వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్దనం |
దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
అతసీపుష్పసంకాశం - హారనూపురశోభితం |
రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
కుటిలాలకసంయుక్తం - పూర్ణచంద్రనిభాననం |
విలసత్కుండలధరం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
మందారగంధసంయుక్తం - చారుహాసం చతుర్భుజం |
బహీర్పింఛావచూడాంగం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
ఉత్ఫుల్లపద్మపత్రాక్షం - నీలజీమూతసన్నిభం |
యాదవానాం శిరోరత్నం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
రుక్మిణీకేళిసంయుక్తం - పీతాంబరసుశోభితం |
అవాప్తతులసీగంధం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
గోపికానాం కుచద్వంద్వం - కుంకుమాంకితవక్షసం |
శ్రీనికేతనం మహేష్వాసం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
శ్రీవత్సాంకం మహోరస్కం - వనమాలావిరాజితం |
శంఖచక్రధరం దేవం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
కృష్ణాష్టక మిదంపుణ్యం-ప్రాత రుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం - స్మరణేన వినశ్యతి ||
Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీ బంధు, మిత్రులకు ఇలా తెలియజేయండి!
శ్రీ కృష్ణాష్టోత్తర శత నామావళి
ఓం కృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః ॥ 10 ॥
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా శంఖాంద్యుదాయుధాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునా వేగసంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనా జీవితహరాయ నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం నందవ్రజ జనానందినే నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ॥ 20 ॥
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం నవనీత నటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీత నవాహారాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగి మధురాకృతయే నమః
ఓం శుకవాగ మృతాబ్ధీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాం పతయే నమః ॥ 30 ॥
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం దేనుకాసుర భంజనాయ నమః
ఓం తృణీకృత తృణావర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తాలతాలభేత్రే నమః
ఓం తమాల శ్యామలాకృతయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః ॥ 40 ॥
ఓం ఇలాపతయే నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతాపహారకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః ॥ 50 ॥
Also Read: శ్రీ కృష్ణుడు స్త్రీ లోలుడా..16 వేల మందితో శృంగారం చేశాడా..మీ ప్రశ్నలకు సమాధానం ఇదిగో!
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం వృందావనాంత సంచారిణే నమః
ఓం తులసీదామ భూషణాయ నమః ॥ 60 ॥
ఓం శ్యమంతక మణేర్హర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపూరుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః
ఓం నరకాంతకాయ నమః ॥ 70 ॥
ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాల శిరశ్ఛేత్రే నమః
ఓం దుర్యోధన కులాంతకాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః ॥ 80 ॥
ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విధ్వంసినే నమః
ఓం బాణాసుర కరాంతకాయ నమః
ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః
ఓం బర్హిబర్హావతంసకాయ నమః ॥ 90 ॥
ఓం పార్థసారథయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహోదధయే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞ్నభోక్ర్తే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం పన్నగాశన వాహనాయ నమః ॥ 100 ॥
ఓం జలక్రీడాసమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్థపాదాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్థాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః ॥ 108 ॥