Yearly Horoscope 2025: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!
Horoscope 2025: 2024 పూర్తవుతోంది... కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకేందుకు సిద్ధమవుతున్నారు. మరి 2025 లో ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది? 12 రాశుల వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి...
Horoscope 2025 all Zodiac Signs
మేష రాశి ఫలాలు 2025 (Aries Yearly Horoscope 2025)
మేష రాశివారికి నూతన సంవత్సరం ఆరంభం బావుంటుంది..మే నుంచి శని ప్రభావంతో ఇబ్బందులు మొదలవుతాయి. వృత్తి, ఉద్యోగం , వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2025 మేష రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వృషభ రాశి ఫలాలు 2025 (Taurus Yearly Horoscope 2025)
కొత్త ఏడాదిలో వృషభ రాశివారికి ఓ రేంజ్ లో ఉంటుంది. మీరున్న రంగంలో మీదే పై చేయి అవుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బావుంటుంది. 2025 వృషభ రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మిథున రాశి ఫలాలు 2025 (Gemini Yearly Horoscope 2025)
ఈ రాశివారికి ఈ ఏడాది కూడా మిశ్రమ ఫలితాలుంటాయి. శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు, ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 2025 మిథున రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
కర్కాటక రాశి ఫలాలు 2025 (Cancer Yearly Horoscope 2025)
కర్కాటక రాశివారికి 2025 ఆరంభంలో అష్టమ శని ప్రభావంతో కొంత ప్రతికూల ఫలితాలున్నా.. ఏప్రిల్ నుంచి పరిస్థితిలో మార్పు మొలవుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. 2025 కర్కాటక రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
సింహ రాశి ఫలాలు 2025 (Leo Yearly Horoscope 2025)
సింహ రాశి వారికి 2025 అనుకూల ఫలితాలనే ఇస్తుంది. 2024 కన్నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బావుంటుంది. వృత్తి, ఉద్యోగంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులకు శుభసమయం. 2025 సింహ రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
కన్యా రాశి ఫలాలు 2025 (Virgo Yearly Horoscope 2025)
కన్యా రాశివారికి 2025 లో ఆదాయం బావుంటుంది కానీ వ్యక్తిగత జీవితంలో చికాకుల తప్పవు. మీరు నమ్ముతున్న వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 2025 కన్యా రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
తులా రాశి ఫలాలు 2025 (Libra Yearly Horoscope 2025)
కొత్త ఏడాది తులా రాశివారికి కలిసొస్తుంది. రిస్క్ తీసుకుని అయినా అనుకున్నది సాధించి తీరుతారు. ఉద్యోగం, వ్యాపారం, విద్య..ఇలా అన్ని రంగాల్లో ఉండేవారికి పురోగతి ఉంటుంది. అవివాహితులకు వివాహయోగం ఉంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. 2025 తులా రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వృశ్చిక రాశి ఫలాలు 2025 (Scorpio Yearly Horoscope 2025)
ఈ రాశివారికి 2025 ఆరంభంలో అర్ధాష్టమ శని ఉండడంతో చికాకులు తప్పవు..అయితే శని రాశిపరివర్తనం చెందిన తర్వాత ఏప్రిల్ 2025 నుంచి ఊహించనంత మార్పు వస్తుంది. అప్పటి నుంచి అన్నీ మంచి రోజులే. 2025 వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ధనుస్సు రాశి ఫలాలు 2025 (Sagittarius Yearly Horoscope 2025)
ధనస్సు రాశివారికి నూతన సంవత్సరం ఆరంభం అదిరిపోతుంది కానీ ఏప్రిల్ నుంచి బెదరగొడుతుంది. శని కుంభం నుంచి మీనంలోకి మారిన తర్వాత నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది..ఫలితంగా కొన్ని ఇక్కట్లు తప్పవు. 2025 ధనస్సు రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మకర రాశి ఫలాలు 2025 (Capricorn Yearly Horoscope 2025)
కొన్నేళ్లుహా ఏలినాటి శనితో ఇబ్బంది పడిన మకర రాశివారికి 2025లో రిలీఫ్ వస్తుంది. మార్చి నెలాఖరులో కుంభం నుంచి శని మీన రాశిలోకి పరివర్తనం చెందుతాడు. అప్పటి నుంచి మీకు అన్నీ మంచి రోజులే. 2025 మకర రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
కుంభ రాశి ఫలాలు 2025 (Aquarius Yearly Horoscope 2025)
2024లో వెంటాడిన చాలా సమస్యలకు 2025లో మీకు రిలీఫ్ ఉంటుంది. ఉద్యోగం, విద్య, వ్యక్తిగతజీవితం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఏడాది ఆరంభంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. 2025 కుంభ రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మీన రాశి ఫలాలు 2025 (Pisces Yearly Horoscope 2025)
2024 కన్నా 2025లో మీన రాశివారికి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. జన్మంలో శని సంచారం ప్రభావం ఆరోగ్యంపై ఉంటుంది. బృహస్పతి ప్రభావంతో ఆదాయానికి లోటుండదు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్తుంది. 2025 మీన రాశి వార్షిక ఫలితాలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
(Happy New Year 2025 Wishes)
ఏబీపీ దేశం ప్రేక్షకులుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు