New Year Astrology Prediction 2025: 6 నెలలు చికాకులు 6 నెలలు ప్రశాంతత .. గృహం , వాహన యోగం - మిథున రాశి వార్షిక ఫలితాలు 2025!
Yearly Horoscope 2025 for Gemini: మిథున రాశివారికి 2025 మిశ్రమ ఫలితాలనిస్తుంది. కొత్త ఏడాదిలో మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
New Year Prediction 2025 Yearly Horoscope for Gemini: నూతన సంవత్సరం 2025 లో మిథున రాశివారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని నెలలు అద్భుతంగా ఉంటే మరికొన్ని నెలలు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్తత్తలు తీసుకోవాలి. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఫలితాలివి..
జనవరి 2025
ఈ నెలలో మీ ఖర్చులు పెరుగుతాయి. నూతన పెట్టుబడుల నుంచి ఆశించిన లాభాలు ఆర్జించడం కష్టమే. ఈ నెలలో పెట్టే పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయండి. అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించకుండా కొత్త పెట్టుబడులు వద్దు. షేర్ మార్కెట్ కు దూరంగా ఉండడం మంచిది
ఫిబ్రవరి 2025
ఈ నెల యువతకు చాలా ముఖ్యమైనది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. మీడియా , కళా ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ నెల అద్భుతంగా ఉంటుంది.
మార్చి 2025
మిథున రాశి వారు మార్చిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఉద్యోగస్తుల బదిలీ గురించి వార్తలు వింటారు ప్రమోషన్‌కు సంబంధించి శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి
Also Read: వృషభ రాశి వార్షిక ఫలితాలు 2025 - ఒక్క నెల మినహా ఏడాది మొత్తం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది
ఏప్రిల్ 2025
ఈ నెలలో బృహస్పతి సంచారం మిథునరాశి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. ఈ నెలలో వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ మీ రంగాల్లో నిపుణులైన వ్యక్తులను కలసిన తర్వాతే పెట్టుబడుల గురించి ఆలోచించండి
మే 2025
మే నెల మిథునరాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. 2025లో గురుగ్రహం మిధునరాశిలో రెండుసార్లు ప్రవేశిస్తుంది. ఈ రాశిలో బృహస్పతి మొదటి సంచారం మే 14న, రెండో సంచారం డిసెంబరు 5 న జరుగుతుంది. ఫలితంగా జీవితంలో చాలా మార్పులు చూడాల్సి ఉంటుంది.
జూన్ 2025
ఈ నెలలో మిథున రాశివారికి వివాహ సంబంధమైన ఆందోళనలు ఉంటాయి. ఏదో ఒక వ్యాధితో బాధపడతారు. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. విద్యార్థులు అధికంగా శ్రమించవలసి ఉంటుంది. మీ ప్రణాళికలను అమలు చేయడంలో అజాగ్రత్తగా ఉండకండి.
జూలై 2025
ఈ నెల మిథున రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. ఓ వైపు ఆర్థిక లాభం ఉంటుంది. అదే సమయంలో విద్యార్థులు చదువుల కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
Also Read: 2025 మొత్తం మేషరాశివారిపై శని ప్రభావం.. ఇబ్బందులతో సావాసం!
ఆగష్టు 2025
ఈ నెలలో మీరు మతపరమైన పనుల్లో బిజీగా ఉంటారు. మీ ప్రవర్తన మారుతుంది. ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 2025
ఈ నెలలో మిథునరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు.
అక్టోబరు 2025
ఈ నెలలో మీరు అనవసర ఖర్చులు తగ్గించాలి. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇదే మంచి సమయం. వృత్తి, ఉద్యోగాల్లో వృద్ధి ఉంటుంది
నవంబరు 2025
ఈ నెలలో మిథున రాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ అభిరుచులు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
డిసెంబర్ 2025
డిసెంబర్ నెల మిథున రాశివారికి ఒత్తిడితో కూడినది అవుతుంది. మీ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. నూతన దంపతులు ఒకర్నొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
Also Read: ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారికి అన్నింటా విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.